Harish Rao : మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..
Harish Rao letter to Mallikarjuna Kharge and Rahul Gandhi: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.., రేవంత్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ..
- By Latha Suma Published Date - 01:52 PM, Thu - 19 September 24

Harish Rao letter to Mallikarjuna Kharge and Rahul Gandhi: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.., రేవంత్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ హరీష్ రావు రాశారు.
Open Letter to Shri @kharge ji , President, AICC
Subject: The Hypocrisy of Indian National Congress in Encouraging shri @revanth_anumula Abusive & Criminal Language Against Shri @KCRBRSPresident Garu, President, @BRSparty – An Appeal for Stern Disciplinary Action.@RahulGandhi… pic.twitter.com/wRNvBiXzw6
— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2024
కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద ప్రమాణాలకు నిదర్శనమని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి మాజీ సీఎం కే.సి.ఆర్ గారిపై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చిందని ఆగ్రహించారు. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా? అంటూ హరీష్ రావు నిలదీశారు.
సీఎం ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడిలా ఉంది..
ఢిల్లీలో ఒక రూల్.. గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. ‘సీఎం రేవంత్ వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం. కాంగ్రెస్ హై కమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉంది. కాంగ్రెస్ పార్టీ తన నైతిక ప్రమాణాలు పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయం. కేసీఆర్, ఆయన కుటుంబంపై ముఖ్యమంత్రి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఆ పదవి స్థాయిని దిగజార్చడం కాదా?. ‘కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలి’ అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్ధిస్తుందా?. హింసాత్మక వ్యాఖ్యలు, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గం. తెలంగాణలో సీఎం రేవంత్ నాయకత్వంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. పార్టీ ద్వంద్వ వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదే. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న సీఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని హరీష్ లేఖలో పేర్కొన్నారు.
Read Also: Vishwambhara : ‘విజృంభణం’ అంటూ రిలీజ్ డేట్ ఫై క్లారిటీ