HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Good News Tomatoes In Ration Shops From Tomorrow Rs 60 Per Kg

Tomatoes@60: రేషన్ షాపుల్లో టమాటా, కేజీ రూ. 60లకే!

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. రెండు వారాల క్రితం రూ.40కి విక్రయించిన టమాటా

  • Author : Balu J Date : 04-07-2023 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tomato Prices
Tomato Rs100

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. రెండు వారాల క్రితం రూ.40కి విక్రయించిన టమాటా ధర గత వారం రూ.70కి చేరుకుంది. ధర మరింత పెరిగి రూ.90 నుంచి రూ.100కి చేరింది. ప్రస్తుతం రూ.100కు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల రూ.120 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

టమాటా ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా 2023 జూలై 4 నుంచి రేషన్ షాపుల్లో టమాటా రూ. 60 వేలకు విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. పెరిగిన ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ చెన్నై, సెంట్రల్ చెన్నైగా విభజించి 82 రేషన్ షాపుల్లో కిలో రూ.60 చొప్పున టమాట విక్రయిస్తామని మంత్రి కేఆర్ పెరియకురుప్పన్ వెల్లడించారు. త్వరలో ఇతర జిల్లాలకు విస్తరించనున్నారు.

వినియోగదారులు, రైతులు నష్టపోకుండా ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పెరియకురుప్పన్ తెలిపారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగాయని, రైతుల నుంచి నేరుగా టమాటా కొనుగోలు చేసి మార్కెట్ ధరలో సగం ధరకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టమోటా ధరలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు పెంచిందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని రైతుల నుంచి నేరుగా టమాట కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పెరియకురుప్పన్ వెల్లడించారు. మరోవైపు చెన్నైలోని ప్రధాన మార్కెట్ అయిన కోయంబేడు కూరగాయల మార్కెట్‌లో టమోటాతో పాటు పచ్చిమిర్చి కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కోయంబేడు మార్కెట్ లో పచ్చిమిర్చి నిల్వలు భారీగా తగ్గిపోవడంతో కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hiking Prices
  • india
  • tamilnadu
  • tomatoes

Related News

Celebrities And Their Plane

పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్‌లో నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఒక పెను విషాదం. ఇటీవలి కాలంలో చూస్తే, 2021లో దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్

  • India- EU Free Trade Deal

    గుడ్ న్యూస్‌.. చౌకగా దొరకనున్న బీర్, మద్యం!

  • mohsin naqvi pak cricket team

    టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!

  • Donald Trump

    భారత్‌తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd