Book Lovers: పార్కుకు వెళ్దాం.. నచ్చిన పుస్తకాలను చదివేద్దాం!
డిజిటల్ బుక్స్ ఎన్ని ఉన్నా పుస్తకాలు చేతుల్లోకి తీసుకొని చదివితే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది.
- Author : Balu J
Date : 08-04-2023 - 3:36 IST
Published By : Hashtagu Telugu Desk
ఇప్పుడంతా టెక్నాలజీ మయం.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు. అయితే పుస్తకాల స్థానంలో ఈ బుక్స్ పుట్టుకొచ్చాయి. దీంతో చాలామందికి (Book Lovers) రీడింగ్ చాలా సులభంగా మారింది. అయితే డిజిటల్ కాలంలో అసలైన పుస్తకాల స్పర్శను కోల్పోతున్నాం. డిజిటల్ బుక్స్ ఎన్ని ఉన్నా పుస్తకాలు చేతుల్లోకి తీసుకొని చదివితే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు (Bengaluru) కొంతమంది యూత్ పుస్తక ప్రియుల కోసం ‘గెట్ టు గెదర్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో పుస్తకాల ప్రియులు అక్కడ వాలిపోతారు. ఇష్టమైన పుస్తకాలు చదువుతూ, షేర్ చేస్తూ పరిచయాలు పెంచుకుంటారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ లో ఒకరు బ్రాండ్ కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ అయిన శ్రుతి సాహ్ మాట్లాడారు.
2022 నూతన సంవత్సర పండుగ సందర్భంగా కబ్బన్ పార్క్‌కు వెళ్లాను. విశాలమైన పచ్చదనం మధ్య ఒక పుస్తకం చదువుతూ విశ్రాంతి తీసుకున్నా. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఊహించనివిధంగా రెస్పాన్స్ వచ్చింది. “నేచర్ లో పుస్తకాలు చదవడం కోసం ప్రతి వారం ఎందుకు కలవకూడదని అనుకున్నా? అని శృతి చెప్పింది. అనుకున్న వెంటనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కొంతమంది బుక్ లవర్స్.
ఈ విధానం చాలా సులభం – మీరు మీకు నచ్చిన ఏదైనా పుస్తకాన్ని తీసుకొని, ప్రతి శనివారం పార్క్‌లోని సర్ మార్క్ కబ్బన్ విగ్రహం దగ్గర గ్రూప్‌లో చేరవచ్చు. “మేం అక్కడ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఉంటా. బుక్స్ లవర్స్ (Book Lovers) ఎవరైనా మాతో జాయిన్ అవుతారు. ఇష్టమైన బుక్స్ చదువుతారు. అంతేకాదు.. పార్కులో కలిసి నడుస్తూ ఇష్టమైన ముచ్చట్టు చెబుకుంటాం”అని హర్ష్ చెప్పారు.
యువర్ కోట్ అనే రైటింగ్ యాప్‌కు సహ వ్యవస్థాపకుడు అయిన హర్ష్ కు చదవడం, రాయడం పట్ల ఆసక్తి. ఇంట్లో 500కి పైగా పుస్తకాలు ఉన్నాయి. అయితే, కబ్బన్ రీడ్స్ ఏర్పడకముందే చదవడం అరుదైన అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. పుస్తకాలు అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో గె టు గెదర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతివారం ఈ కార్యక్రమానికి (Book Lovers) వంద నుంచి రెండు వందల మంది పాఠకులు తరలివచ్చి తమకు ఇష్టమైన పుస్తకాలను చదువుతున్నారు.
Also Read: Shraddha Das Bikini: బికినీలో సెగలు రేపుతున్న శ్రద్దా.. ఘాటైన అందాలకు నెటిజన్స్ ఫిదా!