Hemant Soren : సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మాజీ సీఎం హేమంత్ సోరెన్
- By Latha Suma Published Date - 03:33 PM, Wed - 22 May 24
Hemant Soren:జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) మనీల్యాండరింగ్ కేసు(Money laundering case)లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈడీ అరెస్టును ప్రశిస్తూ ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేశారు. ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సోరెన్ తరపున వాదించిన సిబల్ ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనితో పాటు ట్రయల్ కోర్ట్ లో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన వాస్తవాన్ని దాచినందుకు హేమంత్ సోరెన్‌ను జస్టిస్ దీపంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ మందలించింది. అతని ప్రవర్తన మచ్చలేనిదేమీ కాదని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
”మీ ప్రవర్తన చాలా చెబుతోంది. మీ క్లయింట్ నిజాయితీతో వస్తారని మేము ఆశించాం. కానీ మీరు వాస్తవాలను దాచిపెట్టారు” అంటూ హేమంత్ సోరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు కోర్టు తెలిపింది. కోర్టు హెచ్చరికతో ఆ పిటిషన్‌ను కపిల్ సిబల్ ఉపసంహరించుకున్నారు. కాగా, జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయగా.. ఆయన అరెస్టును జార్ఖాండ్ హైకోర్టు సమర్ధించింది. రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును మే 13న ట్రయిల్ కోర్టు కొట్టివేసింది.
Read Also: Samantha : నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. సమంత ఎవరి కోసం ఈ ప్రార్ధనలు..?
Related News
NEET UG 2024: ‘నీట్ పరీక్షను రద్దు చేయాలి’.. విద్యార్థుల డిమాండ్లు ఇవే..!
NEET UG 2024: నీట్ పరీక్షకు (NEET UG 2024) సంబంధించి శుక్రవారం (జూన్ 14) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఏకకాలంలో సుప్రీంకోర్టులో విచారించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఏ వేసిన పిటిషన్ కూడా ఇందులో ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టులో మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధ�