Cell Phone : ఫోన్ ఎక్కువగా వాడితే పిల్లలు పుట్టరా.. ఇందులో నిజమెంత?
టెక్నాలజీ డెవలప్ అవడంతో మొబైల్ ఫోన్ వినియోగం కూడా ఎక్కువవుతోంది.
- Author : Anshu
Date : 23-06-2022 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
టెక్నాలజీ డెవలప్ అవడంతో మొబైల్ ఫోన్ వినియోగం కూడా ఎక్కువవుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజుల్లో బంధాల కంటే ఎక్కువగా మొబైల్ ఫోన్లకు విలువ ఇస్తున్నారు. కేవలం పెద్దలు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు కూడా ఈ మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తూ చెడు వ్యసనాలకు కూడా బానిసలు అవుతున్నారు. ప్రస్తుత రోజుల్లో అయితే ఒకటో తరగతి చదివే పిల్లవాడి నుంచి ముసలివారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు.
ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అంతకు రెండింతలు నష్టాలు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసినా కూడా ఆ ఈ విషయాన్ని పెడచెవిన పెట్టి మరి మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే మొబైల్ ఫోన్ ను మగవారు, ఆడవారు ఇద్దరూ సమానంగా భావిస్తూ ఉంటారు. కానీ మగవారు మొబైల్ ఫోను ఎక్కువగా ఉపయోగిస్తే పిల్లలు పుట్టరా అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు.
మొబైల్ ఫోన్ ను మగవారు ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు మితిమీరి వాడటంతో పాటు ఆహార లోపాలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి వంటి కారణాలతో పురుషుల్లో సంతానలేమి సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పురుషులు వీలైనంతవరకు ఎలక్ట్రిక్ వస్తువులకు రేడియేషన్ వస్తువులకు దూరంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణం ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి వచ్చే రేడియేషన్ అని అంటున్నారు. కాగా దేశంలో 23 శాతం మగవారు ఫెర్టిలిటీ అనే సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మగవాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుని మొబైల్ ఫోను తక్కువగా ఉపయోగించాలి అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.