27000 Discount : గూగుల్ స్మార్ట్ ఫోన్.. 2వేలే
27000 Discount : ఒక్క వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 27 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది!!
- By Pasha Published Date - 08:13 AM, Mon - 29 May 23

27000 Discount : ఒక్క వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 27 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది!!
ఔను.. ఆ ఫోన్ ధరపై అంతగా డిస్కౌంట్ ఇస్తున్నారు!!
ఇంతకీ ఆ ఫోన్ ఏంటి ? అంతగా డిస్కౌంట్ ఎందుకు ? ఇప్పుడు తెలుసుకుందాం..
యాపిల్ కంపెనీ ఐఫోన్స్ ను ఇష్టపడే వాళ్ళలాగే .. Google ఫోన్‌లను ఇష్టపడే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ఇలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. Google Pixel 6a ఫోన్ పై ఈ ఆఫర్ ఇస్తున్నారు. రూ. 43,999 ధరతో మార్కెట్ లోకి విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు ఇంతకు దొరుకుతుందో తెలుసా .. రూ. 28,999!! అంటే..బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.15వేల డిస్కౌంట్ వస్తోంది. మీరు ఈకామర్స్ పోర్టల్స్ లో చెక్ చేస్తే ఈవిషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఇదే రేంజ్ ఉన్నవేరే ఫోన్ మీ దగ్గర మంచి కండీషన్ లో ఉండి ఉంటే.. దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే కేవలం రూ.2000కే Google Pixel 6a ను మీరు ఇంటికి తీసుకురావచ్చు. అంటే పాత ఫోన్ తో బదిలీ చేసుకుంటే మీకు ఏకంగా 27వేల రూపాయల డిస్కౌంట్ (27000 Discount) దొరుకుతోందన్న మాట.
Also read : Xiaomi civi 3: మార్కెట్ లోకి ఎంఐ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
Google Pixel 6a ఫీచర్లు
- గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ చార్కోల్, చాక్ అనే 2 కలర్స్ లో వస్తోంది.
- 6.1 ఇంచెస్ FULL HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
- 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
- శక్తివంతమైన Google Tensor చిప్‌సెట్ ఫోన్‌లో ఉంది.
- ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4410 mAh బ్యాటరీని కలిగి ఉంది.
- మూడు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లు, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఈ ఫోన్ వచ్చింది.
- ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12.2 MP ప్రైమరీ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
- సెల్ఫీ, వీడియో చాట్ కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
గమనిక : ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో స్మార్ట్‌ఫోన్ రేట్లు మారవచ్చు. కస్టమర్లు తమ స్వంత బాధ్యత, అవగాహనతో షాపింగ్ చేయాలి.