Electrical buses : తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు
ఈ ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్-హైదరాబాద్, నిజామాబాద్-హైదరాబాద్ మార్గాలలో నడపాలనీ ఆర్టీసీ నిర్ణయించింది.
- By Latha Suma Published Date - 05:34 PM, Sun - 18 August 24

Electrical buses: త్వరలోనే తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC) ఎలక్ట్రికల్ బస్సులు (Electrical buses) ప్రవేశ పెట్టనుంది. తొలుత ఈ నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్-హైదరాబాద్, నిజామాబాద్-హైదరాబాద్ మార్గాలలో నడపాలనీ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు సూపర్ లగ్జరీ పేరుతో తీసుకు రానున్న ఈ బస్సులు ఇప్పటికే కరీంనగర్ డిపోకు 35, నిజామాబాద్ డిపోకు 13 చేరుకున్నాయి. ఈ బస్సులను ఆర్టీసీ ప్రైవేట్ సంస్థ నుంచి అద్దెకు తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఇప్పటికే హైదరాబాద్ లో సిటీ బస్సులుగా, హైదరాబాద్- విజయవాడ మధ్య అంతరాష్ట్ర సర్వీసులుగా నడిపిస్తోంది. ఇవన్నీ మెట్రో డీలక్స్ బస్సులు కాగా ప్రస్తుతం సూపర్ లగ్జరీ బస్సులను నడిపించనుంది. త్వరలోనే వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ఆర్టీసీలో సూపర్ లగ్జరీలో ఎలక్ట్రిక్ బస్సులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలోనే ఈ బస్సులను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్పాయి. మామూలుగా అయితే కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త బస్సులను తీసుకు రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దాంతో.. డీజిల్ బస్సులు కాకుండా.. ఎలక్ట్రిక్ బస్సులకు సంస్థ ప్రాధాన్యమిస్తోంది. వీటిల్లో డ్రైవర్లుగా బస్సు తయారీ సంస్థ సిబ్బందే ఉండనున్నారు. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ నుంచి ఉంటారు. ఈ బస్సులకు కిలోమీటర్ల వారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో.. తెలంగాణ ప్రభుత్వం రద్దీ ఎక్కువగా ఉండి… డిమాండ్ చేస్తున్న కొన్ని ప్రాంతాలకు కొత్త సర్వీసులను వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Read Also: Power Consumption : ఆగస్టులో పెరిగిన విద్యుత్ వినియోగం..