Diwali – Car Safety : దీపావళి రోజు సేఫ్‌గా కారు పార్కింగ్ ఇలా..
Diwali - Car Safety : రేపే(ఆదివారం) దీపావళి పండుగ. క్రాకర్స్ ఇంటింటికీ చేరుతున్నాయి.
- By Pasha Published Date - 12:58 PM, Sat - 11 November 23

Diwali – Car Safety : రేపే(ఆదివారం) దీపావళి పండుగ. క్రాకర్స్ ఇంటింటికీ చేరుతున్నాయి. దీపావళి రోజున బాణాసంచా పేలుళ్లతో ఊరూవాడా దద్దరిల్లుతాయి. ప్రధాన రోడ్లు, గల్లీలు అనే తేడాలేకుండా టపాసులు పేలుతాయి. ఈనేపథ్యంలో కార్లు ఉన్నవాళ్లు, వాటిని భద్రంగా ఉంచుకునేందుకు కొన్ని సేఫ్టీ టిప్స్‌ను ఫాలో కావాలి. క్రాకర్స్ బారినపడకుండా కార్లను కాపాడుకునేందుకు ఆ టిప్స్‌ను అనుసరించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
- దీపావళి రోజున కారుపై కవర్ కప్పకండి. ఒకవేళ కవర్‌ను కప్పితే.. నిప్పు రవ్వలు ఎగిరొచ్చి దానిపై పడి మంటలు ఈజీగా వ్యాపిస్తాయి. అందుకే కారుపై కవర్ కప్పొద్దు.
- మీరు కారును పార్క్ చేసి.. అన్ని యాంగిల్స్ నుంచి కొన్ని ఫొటోలు తీసుకోండి. క్రాకర్స్ కారణంగా కారుకు ఏదైనా జరిగితే.. ఫొటోల ఆధారంగా కారుకు డ్యామేజ్ జరిగిన భాగాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
- కొంతమంది పిల్లలు సరదా కోసం వాహనాల కింద టపాసులు పేలుస్తుంటారు. దీన్ని గుర్తించి, అలా జరగకుండా చూసుకోవాలి.
- దీపావళి రోజున వీలైతే మీ కారును మీ ఇంటి రూఫ్ కింద లేదా మరైదేనా సేఫ్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసుకోండి. వీలైతే కొంత రుసుమును చెల్లించి ఎక్కడైనా సేఫ్ పార్కింగ్‌ను వాడుకోండి.
- దీపావళి టపాసులు విక్రయిస్తున్న ప్రాంతాలకు దగ్గరగా వాహనాలను పార్క్(Diwali – Car Safety) చేయకండి.