Krish: డ్రగ్స్ కేసు.. తెలంగాణ హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్
- Author : Latha Suma
Date : 01-03-2024 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
Director Krish: హైదరాబాద్(hyderabad) లోని హోటల్ రాడిసన్(Hotel Radisson)లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. అయితే పార్టీ జరుగుతున్న సమయంలో ఇదే హోటల్ కు టాలీవుడ్ దర్శకుడు క్రిష్(Director Krish) వెళ్లినట్టు, పార్టీ నిర్వాహకుడు గజ్జల వివేకానంద్ తో క్రిష్ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి.
డ్రగ్స్ వ్యవహారంలో క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో గచ్చిబౌలి పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. క్రిష్ ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు క్రిష్ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్(Anticipatory Bail)కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో గజ్జల వివేకానంద్ ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. వివేకానంద్ వీకెండ్ లో హోటల్ కు వచ్చేవాడని, అతడు ఇచ్చే పార్టీలకు సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు కూడా వచ్చేవారని ప్రాథమికంగా గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join.
రాడిసన్ హోటల్ లో 200 సీసీ కెమెరాలు ఉండగా, వాటిలో 20 మాత్రమే పనిచేస్తున్న స్థితిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు చాలా కేసులను సీసీ టీవీ ఫుటేజి సాయంతో ఛేదిస్తుంటారు. కానీ ఈ కేసులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు సవాలుగా మారనుంది.
read also : Cafe Explosion: ప్రముఖ కేఫ్‌లో పేలుడు.. పలువురికి గాయాలు