Mother Will Give All : అమ్మ అన్నీ ఇస్తుంది.. నాకు తెలుసు : డీకే
"మేము కాంగ్రెస్ అనే ఇంట్లో ఒక భాగం.. ఒక తల్లి తన బిడ్డకు ప్రతీదీ ఇస్తుంది(Mother Will Give All).. నాకు తెలుసు" అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
- By Pasha Published Date - 11:04 AM, Tue - 16 May 23

“మేము కాంగ్రెస్ అనే ఇంట్లో ఒక భాగం.. ఒక తల్లి తన బిడ్డకు ప్రతీదీ ఇస్తుంది(Mother Will Give All).. నాకు తెలుసు” అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. పార్టీ తన కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తుందని (Mother Will Give All) ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం పోస్టు కోసం పార్టీని బ్లాక్ మెయిల్ చేయనని స్పష్టం చేశారు. ఆ విధంగా చేసి తన చరిత్రకు మచ్చ తెచ్చుకోనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరే సమయంలో డీకే శివకుమార్ ఈ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి 20 ఎంపీ సీట్లను సాధించిపెట్టడమే తమ తదుపరి లక్ష్యమని వెల్లడించారు.
also read : New CM: సిద్ధరామయ్యే కర్ణాటక కొత్త సీఎం?… అధికారిక ప్రకటనే తరువాయి
కొన్ని గంటల్లో ఆ ప్రకటన ..
కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఇవాళ సాయంత్రంలోగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా సీఎం రేసులో ఉన్నారు. తనకు వయసు మీదపడిందని.. మొదటి రెండేళ్లు తనకు సీఎం పోస్టు ఇస్తే చాలని ఆయన పార్టీ అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టారని ఒక జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఓ వైపు డీకే .. మరోవైపు సిద్ధరామయ్య వీరిలో ఎవరిని సీఎం చేస్తారో కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.