Nalgonda : బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరణ
పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్నారు.
- By Latha Suma Published Date - 11:55 AM, Mon - 20 January 25

Nalgonda : నల్గొండలో రేపటి కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. రైతు ధర్నా ప్రతిపాదిత స్థలం హైవే వెంట ఉండటంతో అనుమతి నిరాకరించారు. జిల్లాలో గ్రామసభలు జరుగుతుండటం.. హైవేపై సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ధర్నాకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినట్లు బీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్నారు.
కాగా, రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.