Naga Chaitanya : తండేల్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ ప్లానింగ్..!
Naga Chaitanya సినిమా కూడా అంచనాలకు తగినట్టుగా ఉంటే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ తో
- By Ramesh Published Date - 11:36 AM, Mon - 20 January 25

Naga Chaitanya అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి. తండేల్ సినిమా సాంగ్స్ కి సూపర్ బజ్ ఏర్పడింది. సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఐతే ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో పాటుగా లేటెస్ట్ గా మలయాళ వెర్షన్ కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. సో నాగ చైతన్య కెరీర్ లో తండేల్ మొదటి పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఈ సినిమా ఇప్పటికే సాంగ్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో..
ఇక సినిమా కూడా అంచనాలకు తగినట్టుగా ఉంటే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ తో ఉన్నారు. నాగ చైతన్య సాయి పల్లవి కలిసి చేసిన లవ్ స్టోరీ ఆల్రెడీ సూపర్ హిట్ కాగా తండేల్ కూడా ఆ హిట్ మేనియా కొనసాగుతుందని అంటున్నారు.
చైతన్య రఫ్ లుక్స్ తో తన నట విశ్వరూపం చూపించేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న తండేల్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.