Census : త్వరలో జనగణన చేపడతాం: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Census will be taken soon : ఎన్‌డిఎ నేతృత్వంలోని మోడీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- By Latha Suma Published Date - 05:57 PM, Tue - 17 September 24

Census will be taken soon : త్వరలో జనగణన చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. ఎన్‌డిఎ నేతృత్వంలోని మోడీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే జనగణన ప్రక్రియ నిర్వహిస్తాం. జనగణన ప్రకటించిన తర్వాత ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను కచ్చితంగా వెల్లడిస్తాం’ అని అమిత్‌షా అన్నారు. 60 ఏళ్ల తర్వాత తొలిసారి రాజకీయ సుస్థిరత నెలకొన్నది. మాకు విధానాలను అమలు పరచడం, వాటి కొనసాగింపునకు సంబంధించిన అనుభవం కూడా ఉంది. మొదటిసారి భారత్ విదేశాంగ విధానంలో మెరుగ్గా ఉంది. అంతర్గతంగానూ, బాహ్యంగానూ భారత్ దృఢమైన యంత్రాంగాన్ని కలిగి ఉందని అమిత్‌షా అన్నారు.
Read Also: Viral Video : ఒక్కసారిగా వైరల్ గా మారిన మోక్షా సేన్‌గుప్తా..ఇంతకీ ఈమె ఏంచేసిందంటే..!!
3.0 మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదించింది. మధ్యతరగతికి ప్రజానీకానికి పన్నులు లాభం చేకూరేలా మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ పథకం, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ బీమా సౌకర్యం, మూడు కొత్త క్రిమినల్ చట్టాలు, ఇతర కొన్ని పథకాలను చేపట్టడం జరిగిందని అమిత్‌షా అన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తామని, చేపట్టబోయే పనులు త్వరగా పూర్తిచేసేందుకు లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందే బ్యూరోక్రసీని మోడీ కోరినందున మేము అనుకున్న పనులను పూర్తిచేయగలిగాం. కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని అమిత్‌షా అన్నారు. రైలు ప్రమాదాలపైనా తాము దృష్టిసారించామని, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా రక్షణ పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అమిత్‌షా తెలిపారు.