HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Byjus Vacates 4 Lakh Sq Ft Office Space In Bengaluru To Cut Costs

Byjus Vacate : అద్దె కట్టలేక అతిపెద్ద ఆఫీస్ ఖాళీ చేసిన ‘బైజూస్’

Byjus Vacate : దేశంలోని ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ ‘బైజూస్’ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.

  • Author : Pasha Date : 20-02-2024 - 2:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Loss-Making Companies
ED Raids on Byjus CEO Ravindran office and house

Byjus Vacate : దేశంలోని ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ ‘బైజూస్’ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. చివరకు ఆఫీసుల అద్దెలు కూడా కట్టలేని స్థితికి  ‘బైజూస్’ చేరుకుంది. ఈ కంపెనీ ఇప్పటికే పలు ఆఫీసుల్ని ఖాళీ చేసింది. తాజాగా బెంగళూరులో మరో పెద్ద ఆఫీసును ఖాళీ చేసేసింది. నగరంలోని ప్రెస్టైజ్ టెక్ పార్కులో ఉన్న 4 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఆఫీస్ స్పేస్‌ను వదిలేసింది. అద్దె కట్టలేక బైజూస్ ఇలా చేసింది. కంపెనీ నిర్వహణకు సరిపడా నిధులు లేక.. ఆఫీసుల సంఖ్యను ఈవిధంగా తగ్గిస్తోంది. ప్రెస్టైజ్ టెక్ పార్కులో ఉన్న బైజూస్ ఆఫీసు బిల్డింగ్  రెంటల్ అగ్రిమెంట్‌ను ఈ ఏడాది ఆరంభంలోనే రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలలుగా అద్దె చెల్లించకుండా..  ముందే చెల్లించిన డిపాజిట్‌తో సర్దుబాటు చేసుకున్నట్లు సమాచారం. దేశంలోని మరికొన్ని చోట్ల కూడా బైజూస్  సంస్థ(Byjus Vacate) ఇదేవిధంగా అద్దె కార్యాలయాలను ఖాళీ చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

బెంగళూరులో ప్రెస్టైజ్ గ్రూప్‌తో మూడున్నర సంవత్సరాల కిందట ఆఫీస్ స్పేస్ కోసం బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. రెంటల్ అగ్రిమెంట్లో భాగంగా నెలకు రూ. 4 కోట్లు అద్దె కట్టాలి.  ప్రస్తుతం కంపెనీ అప్పుల ఊబిలో ఉంది. దీంతో అంత భారీ అప్పులు కట్టడం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. బెంగళూరులో ఉన్న కల్యాణి టెక్ పార్కులోని 5 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఓ ఆఫీసు అద్దెను కూడా బైజూస్ గత 10 నెలలుగా చెల్లించడం లేదట. దీంతో బైజూస్‌కు కల్యాణి డెవలపర్స్ లీగల్ నోటీసులు పంపారు. 2025 మార్చితో అక్కడి ఆఫీసు అగ్రిమెంట్ ముగుస్తుంది.  ముందస్తు డిపాజిట్‌తో 7 నెలల అద్దెను బైజూస్ సర్దుబాటు చేసుకుంటుందని సమాచారం.

Also Read : Marathas Reservation : మరాఠాలకు10 శాతం రిజర్వేషన్.. బిల్లుకు కేబినెట్ ఆమోదం

‘బైజూస్’ సంక్షోభంపై సమాచారం .. 

  • బైజూస్ ఎడ్‌టెక్ కంపెనీని బైజూస్ రవీంద్రన్, దివ్యా గోకుల్‌నాథ్ కలిసి 2011లో ప్రారంభించారు.
  • కరోనా సమయంలో దీనికి మంచి వ్యాపారం జరిగింది. ఆ  తర్వాత ఆదరణ తగ్గుతూ వచ్చింది.
  • విదేశాల్లో బ్రాంచులు తెరవడంతో కంపెనీ అప్పులు పెరిగాయి.
  • అప్పులను తిరిగి కట్టలేక కంపెనీ ఇబ్బందులు పడుతోంది.
  • విదేశీ నిధులకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలు బైజూస్ యాజమాన్యంపై  వచ్చాయి.
  • ఇటీవలకాలంలో బైజూస్ ఎంతోమంది  ఉద్యోగులకు తీసేసింది.  ఉద్యోగులకు జీతాలు చెల్లింపు కూడా బాగా లేట్ చేస్తూ వస్తోంది.
  • బైజూస్ తన ఉద్యోగుల  పీఎఫ్ బకాయిలు కూడా చెల్లించనట్లు తెలిసింది.
  • ఈ సంక్షోభం నేపథ్యంలో బైజూస్ కంపెనీ బోర్డు నుంచి వ్యవస్థాపకుడు రవీంద్రన్‌నే తప్పించేందుకు ఇన్వెస్టర్లు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : IRCTC iPay Autopay : డబ్బులు కట్ కాకుండానే టికెట్.. ఐఆర్‌సీటీసీ ‘ఐపే ఆటోపే’ ఫీచర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 Lakh Sq Ft Office
  • bengaluru
  • business
  • byjus
  • Byjus Vacate

Related News

Solar Capacity For AC

ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

ఎండల నుండి ఉపశమనం పొందడంతో పాటు మీ కరెంటు ఖర్చులను దాదాపుగా సున్నా చేసుకోవచ్చు. అలాగే సోలార్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైన, సురక్షితమైన శక్తి కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

    Latest News

    • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

    • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

    • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

    • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd