IRCTC iPay Autopay : డబ్బులు కట్ కాకుండానే టికెట్.. ఐఆర్సీటీసీ ‘ఐపే ఆటోపే’ ఫీచర్
IRCTC iPay Autopay : రైలు ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ‘ఐపే ఆటోపే’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- By Pasha Published Date - 01:21 PM, Tue - 20 February 24
IRCTC iPay Autopay : రైలు ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ‘ఐపే ఆటోపే’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా మనం ఛార్జీని చెల్లించకుండానే ట్రైన్ టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ కన్ఫామ్ అయిన తర్వాతే పేమెంట్ చేయొచ్చు. దీనివల్ల ట్రైన్ టికెట్ బుక్ కాని పరిస్థితుల్లో మనం డబ్బులు కోల్పోయే ఛాన్స్ ఉండనే ఉండదు. రీఫండ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join
ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లలో..
‘ఐపే ఆటోపే’ అనేది ఐఆర్సీటీసీ సొంత పేమెంట్ గేట్‌వే. ఇది ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లో అందుబాటులో ఉంటుంది.ఐపే పేమెంట్ గేట్‌వేకు ఉన్న ప్రత్యేక ఫీచర్ ‘ఆటోపే’. ‘ఆటో పే’ ఫీచర్లో(IRCTC iPay Autopay) యూపీఐ, డెబిట్/ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ విలువ కలిగిన లేదా వెయిట్ లిస్ట్‌లో ఉన్న ట్రైన్ టికెట్లను ఈజీగా, మనీ రిస్క్ లేకుండా బుక్ చేయొచ్చు. ఈ పద్ధతి ద్వారా ఒకవేళ మనం ట్రైన్ టికెట్ బుక్ చేసినా బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు బదిలీ కావు. మన బ్యాంక్ ఖాతాలో ఉన్న టికెట్ ఛార్జీ మొత్తంపై లైయెన్ విధిస్తారు. లైయెన్ అంటే బ్యాంక్ అకౌంట్లోని డబ్బు వేరే చోట ఖర్చు చేయకుండా నియంత్రణ విధించడం. మన టికెట్ కన్ఫామ్ కాకపోయినా, క్యాన్సిల్ అయినా డబ్బులపై ఉన్న నియంత్రణ తొలగిపోతుంది.
Also Read : Nikki Haley – Kamala Harris : నేను లేదా కమల.. అమెరికా అధ్యక్ష పీఠంపై మహిళ : నిక్కీ
‘ఆటోపే’ చేయడం ఇలా..
- ఆటోపే ఫీచర్‌ను వాడుకునేందుకు మీరు తొలుత ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి లాగిన్ కండి.
- మీ ప్రయాణ వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి.
- మీ రైలు, కోచ్, ప్రయాణికుల వివరాలను పొందుపర్చండి.
- పేమెంట్ బటన్‌పై క్లిక్ చేసి iPayను పేమెంట్ గేట్‌వేలా సెలెక్ట్ చేసుకోండి.
- Autopay, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐఆర్సీటీసీ ముద్ర, నెట్‌బ్యాంకింగ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- Autopay ఆప్షన్‌తో పాటు మీకు కావాల్సిన పేమెంట్ విధానం ఎంపిక చేయండి. అక్కడ మీకు యూపీఐ, డెబిట్/ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లు కనిపిస్తాయి.
- పేమెంట్ వివరాలను నమోదు చేస్తే మీ లావాదేవీ కంప్లీట్ అవుతుంది.
- వెంటనే మీ బ్యాంకు, టికెట్ డబ్బులపై నియంత్రణ విధిస్తుంది.
- టికెట్ బుక్ అయిన తర్వాతే మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.
Also Read : Election Schedule 2024 : మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్.. డేట్స్ ఫిక్స్ !
- ఒకవేళ వెయిట్‌లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్ చేసిన సందర్భాల్లో అది కన్ఫామ్ కాకపోతే మీ డబ్బులు కట్ కావు. ఆటోపే నియంత్రణ తొలగిపోవడం వల్ల మీరు మీ డబ్బులను ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
- తత్కాల్ కోటాలో వెయిల్లిస్ట్లో ఉన్న టికెట్ బుక్ చేసినప్పుడు, ఒకవేళ అది కన్ఫామ్ కాకపోతే, మీరు కేవలం క్యాన్సలేషన్ ఫీజు, ఐఆర్సీటీసీ కన్వీనియెన్స్ ఫీజు, మాండేట్ ఛార్జీలు కడితే చాలు. మిగతా డబ్బు మీ ఖాతాలోకి తిరిగి వచ్చేస్తుంది.
- ఇక వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ట్రైన్ టికెట్‌ను బుక్ చేస్తే.. అది కన్ఫామ్ కానప్పుడు మన డబ్బులు వెంటనే రీఫండ్ అవుతాయి. కాకపోతే కనీసం 4 రోజులు వెయిట్ చేయాలి.
Related News
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే యాప్‌లో అన్ని రకాల రైల్వే సేవలు..!
భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు రైల్వేకు సంబంధించి ఓ శుభవార్త బయటకు వస్తోంది.