Byjus Founder Tears : ఏడ్చేసిన “బైజూస్” రవీంద్రన్.. అప్పుల భారంతో తీవ్ర ఒత్తిడి!
Byjus Founder Tears : ఎన్నో స్టార్టప్ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి..దీంతో ఆ స్టార్టప్ లను స్థాపించిన ఎంతోమంది ఎంట్రప్రెన్యూర్స్ టెన్షన్ లో ఉన్నారు..
- By Pasha Published Date - 12:12 PM, Wed - 26 July 23

Byjus Founder Tears : ఎన్నో స్టార్టప్ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి..
దీంతో ఆ స్టార్టప్ లను స్థాపించిన ఎంతోమంది ఎంట్రప్రెన్యూర్స్ టెన్షన్ లో ఉన్నారు..
ఎడ్ టెక్ స్టార్టప్ “బైజూస్”(Byju’s) కూడా ఆ కోవలోకే వస్తుంది..
“బైజూస్” ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో.. ఆ కంపెనీ ఫౌండర్ బైజూ రవీంద్రన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
ఈక్రమంలో ఆయన ఓ ప్రోగ్రాంలో అందరి ముందు నిలబడి ఏడ్చేశారు..
Also read : Telangana Ooty: తెలంగాణ ఊటీ రమ్మంటోంది.. కనువిందు చేస్తున్న అనంతగిరి అందాలు!
బైజూ రవీంద్రన్ ప్రైవేట్ ట్యూటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు. బైజూస్ పేరుతో ఎడ్ టెక్ కంపెనీని స్థాపించి దేశంలో సంచలనం సృష్టించారు. ఇప్పుడు బైజూస్ కు దాదాపు రూ.10వేల కోట్ల అప్పులు ఉన్నాయి. వీటిని తిరిగి చెల్లించాలంటూ రుణాలు ఇచ్చిన సంస్థలు రవీంద్రన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. కోర్టుల్లో కేసులు వేసి లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో బైజూస్ కంపెనీ మార్కెట్ విలువ 22 బిలియన్ డాలర్ల నుంచి 5.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. దీంతో బైజూ రవీంద్రన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారు. ఈక్రమంలో రూ.8వేల కోట్ల (1 బిలియన్ డాలర్ల) ఈక్విటీ నిధుల సమీకరణ కోసం ఆయన మిడిల్ ఈస్ట్ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆ దేశాల ఇన్వెస్టర్ గ్రూప్ లతో సమావేశమై తన కంపెనీ గురించి, భవిష్యత్ అభివృద్ధి అవకాశాల గురించి డెమోలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల దుబాయ్‌లో ఓ ఇన్వెస్టర్ గ్రూప్ తో మీటింగ్ సందర్భంగా బైజూస్ గురించి వివరిస్తూ.. బైజూ రవీంద్రన్ ఏడ్చేశారని (Byjus Founder Tears) తెలిసింది. ఆ మీటింగ్ కు హాజరైన కొందరు ఈవిషయాన్ని చెప్పారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు పబ్లిష్ చేశాయి.
Also read : Hebba Patel : అందాలతో సెగలు పుట్టిస్తున్న హెబ్బా పటేల్