Bomb threat : కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
- Author : Latha Suma
Date : 22-05-2024 - 6:41 IST
Published By : Hashtagu Telugu Desk
Central Home Ministry: దేశంలో పలు పాఠశాలలకు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు(Bomb threat) వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు కేంద్ర హోంశాఖకే(Central Home Ministry) బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. అమిత్‌షా( Amit Shah)నియంత్రణలోని హోంశాఖను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వెంటనే నార్త్ బ్లాక్(North Block)లోని రెడ్ స్టోన్ బిల్డింగ్ వద్దకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. బాంబ్ స్వ్కాడ్, జాగిలాల సాయంతో బిల్డింగ్ మొత్తం తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ దొరకలేదు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: RCB Vs RR: టెర్రరిస్టుల నుంచి విరాట్ కోహ్లీకి ప్రాణహాని
కాగా, ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్, జైపూర్, ఉత్తర ప్రదేశ్, బెంగళూరులోని పలు పాఠశాలలకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ అన్నీ వట్టివేనని తేలింది.