HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Bomb Threat To Kerala Cm Office

Bomb Threats : కేరళ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు

గత రెండు వారాలుగా కేరళలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్‌ కలకలం సృష్టిస్తున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

  • By Latha Suma Published Date - 02:14 PM, Mon - 28 April 25
  • daily-hunt
Bomb threat to Kerala CM office
Bomb threat to Kerala CM office

Bomb Threats : కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్‌ తో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తున్నారు. సీఎం కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గత రెండు వారాలుగా కేరళలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్‌ కలకలం సృష్టిస్తున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఆదివారం తిరువనంతపురం విమానాశ్రయానికి, రాజధానిలోని ప్రముఖ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లు తెలిపారు.

Read Also: Mayor Election : విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు

ఇక, సమాచారం అందుకున్న బాంబు, డాగ్ స్క్వాడ్‌లు విమానాశ్రయ టెర్మినల్స్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేవని..అవి నకిలీ బెదిరింపు కాల్స్‌గా గుర్తించామని పేర్కొన్నారు. గత రెండు వారాల్లో 12 బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మే 2న కేరళను సందర్శించి విజింజం అంతర్జాతీయ ఓడరేవు ను జాతికి అంకితం చేయనున్నారు. జూలై 2024లో ఓడరేవు ట్రయల్ రన్ నిర్వహించి డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ఓడరేవు ప్రాజెక్టు ఆపరేషన్‌తో పాటు కంట్రోల్ సెంటర్లను సందర్శించారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఈ నకిలీ కాల్స్‌పై దర్యాప్తు వేగవంతం చేశామని అధికారులు తెలిపారు.

Read Also: Pahalgam Attack : లష్కరే ఉగ్రవాదితో బంగ్లా ప్రభుత్వ పెద్ద భేటీ.. మరో స్కెచ్ ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bomb Threat Emails
  • bomb threats
  • kerala cms office
  • pm modi
  • Thiruvananthapuram Airport

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

  • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd