Maruti Jimny : ఆ కారుపై రూ.లక్షన్నర డిస్కౌంట్.. కొనేయండి
Maruti Jimny : మారుతీ సుజుకీ కార్లకు మనదేశంలో ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది.
- Author : Pasha
Date : 08-03-2024 - 6:26 IST
Published By : Hashtagu Telugu Desk
Maruti Jimny : మారుతీ సుజుకీ కార్లకు మనదేశంలో ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. అలాంటి కార్ల మోడళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మారుతీ సుజుకీ కీలక ప్రకటన చేసింది. ఎస్‌యూవీ కేటగిరీలో బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఎస్‌యూవీ కేటగిరిలోని కస్టమర్లను తమవైపునకు తిప్పుకునేందుకు భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఏకంగా రూ. 1.50 లక్షల దాకా !! ఇంతకీ ఏ ఎస్‌యూవీ మోడల్‌పై అనుకుంటున్నారా ? మారుతీ సుజుకీ జిమ్నీ (Maruti Jimny) మోడల్‌పై ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. భారీ అంచనాలతో 2023 లో మారుతీ సుజుకీ జిమ్నీ ఎస్‌యూవీని కంపెనీ లాంఛ్ చేసింది. మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్‌యూవీలను ఇది అంతగా ఢీకొనలేకపోయింది. ఈనేపథ్యంలో భారీ ఆఫర్‌ను మారుతీ సుజుకీ ప్రకటించింది. జిమ్నీని విడుదల చేసినప్పటి నుంచి మారుతి సుజుకీ ఈ ఎస్‌యూవీ ధరల వ్యూహంపై విమర్శలను ఎదుర్కొంది.రిటైల్ సేల్స్ ను పెంచుకునే ప్రయత్నంలో మారుతి సుజుకీ జిమ్నీ మోడల్ లో థండర్ ఎడిషన్ ను కూడా విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join
- మారుతీ సుజుకీ జిమ్నీ ఎస్‌యూవీ 5 డోర్లతో ఉంటుంది.
- మారుతీ సుజుకీ నెక్సా ప్రీమియం రిటైల్ నెట్ వర్క్ ద్వారా దీన్ని సేల్ చేస్తున్నారు.
- జిమ్నీ 2024 మోడల్ పై రూ. 50 వేల క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. మరో రూ. 3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు.
- 2023 లో తయారైన జిమ్నీ మోడళ్లపై గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
- వేరియంట్, ప్రాంతం, స్టాక్ లభ్యతను బట్టి ఈ ఆఫర్లలో తేడాలు ఉంటాయి.
Also Read : Fifth Marriage : మర్దోక్ పెళ్లికొడుకాయెనె.. 93 ఏళ్ల ఏజ్‌లో ఐదో పెళ్లి.. ఎవరితో ?
- జెటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో మారుతీ సుజుకీ జిమ్నీ లభిస్తుంది.
- మారుతీ సుజుకీ జిమ్నీ ధర రూ. 12. 74 లక్షల నుంచి రూ. 14. 79 లక్షల దాకా ఉంటుంది.
- ఈ కార్లను దక్షిణాఫ్రికా, ఇండోనేషియా వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
- మారుతీ సుజుకీ జిమ్నీ 1. 5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది.
- ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది.
- 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్ మిషన్ తో లభిస్తోది.
- ఇంజిన్ గరిష్ఠంగా 103 బీహెచ్‌పీ పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.