Viral Video : దటీజ్ టైగర్.. బోటు నుంచి జంప్.. వీడియో వైరల్!!
పులి గర్జన.. పులి లంఘన.. ఈ రెండూ వాటికవే సాటి!! ఈ రెండింటిని చూపించే ఒక అద్భుత వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇది ఒక్కరోజులోనే 88,000 వ్యూస్, 4000 లైక్స్ ను సంపాదించింది .
- By Hashtag U Published Date - 06:00 PM, Mon - 18 April 22

పులి గర్జన.. పులి లంఘన.. ఈ రెండూ వాటికవే సాటి!! ఈ రెండింటిని చూపించే ఒక అద్భుత వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇది ఒక్కరోజులోనే 88,000 వ్యూస్, 4000 లైక్స్ ను సంపాదించింది . ఇంతకీ ఈ వీడియో ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో తీసింది కాదు.. మన దేశంలోని సుందర్ వన్ అభయారణ్యంలోనే తీశారు. అటవీ అధికారులు ఒక రాయల్ బెంగాల్ టైగర్ ను కాపాడి.. సుందర్ వన్ అడవి లోపల వదిలి పెట్టేందుకు ఒక బోటులో పయనమయ్యారు. కొద్దిసేపైతే అడవికి చేరుకుంటారనగా.. పులి అకస్మాత్తుగా బోటులో నుంచి నీళ్లలోకి దూకింది. స్వేచ్ఛగా ఈదుతూ.. ఒడ్డుకు చేరుకొని , అడవి తల్లి నీడలోకి రయ్ మంటూ పరుగులు తీసింది. ఈవీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐ ఎఫ్ ఎస్) పర్వీన్ కస్వాన్ ట్విటర్ లో ఏప్రిల్ 17న ఉదయం 12 గంటలకు షేర్ చేశారు. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు.. ‘బోటులో నుంచి నీళ్లలోకి పులి దూకడం, ఈదుకుంటూ వెళ్లడం ‘ లైఫ్ ఆఫ్ పై ‘ సినిమా సీన్ ను గుర్తుచేసిందని కామెంట్ చేశారు.
That tiger sized jump though. Old video of rescue & release of tiger from Sundarbans. pic.twitter.com/u6ls2NW7H3
— Parveen Kaswan (@ParveenKaswan) April 17, 2022