Liquor scam case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
తదుపరి విచారణ మే 13కి వాయిదా వేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక నిందితులుగా భావిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన మద్యం విధానాల ముసుగులో అవినీతిని అమలు చేయడంలో వీరి పాత్ర చాలా కీలకమైంది.
- By Latha Suma Published Date - 12:00 PM, Thu - 8 May 25

Liquor scam case : ఏపీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ముగ్గురు కీలక నిందితులకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక ఊరట కల్పించలేదు. తదుపరి విచారణ మే 13కి వాయిదా వేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక నిందితులుగా భావిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన మద్యం విధానాల ముసుగులో అవినీతిని అమలు చేయడంలో వీరి పాత్ర చాలా కీలకమైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే మొత్తం 30 మందిని నిందితులుగా చేర్చింది.
Read Also: Solidarity Rally : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం, నాటి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి (ఓఎస్డీ) కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప మద్యం విధాన రూపకల్పన నుంచి ముడుపుల వసూళ్ల నిర్వహణ వరకూ అనేక మలినచర్యల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ ముగ్గురూ ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితోపాటు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆ పార్టీ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి వంటి వారితో కలిసి వ్యవస్థపరమైన స్థాయిలో మద్యం సిండికేట్‌ను నడిపారని సిట్ తేల్చింది. వీరు నిబంధనలకు విరుద్ధంగా మద్యం పంపిణీ విధానాన్ని మార్చి, దాని ద్వారా వందల కోట్ల రూపాయలు లబ్ధి పొందేందుకు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు తీవ్రత, అభియోగాల గంభీరత దృష్ట్యా సుప్రీంకోర్టు ప్రస్తుతం ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో నిందితుల ఐదు మందికి బెయిల్ ఆశలు నెరవేరలేదు. ఈ కేసు పరిణామాలపై రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. మే 13న జరిగే తదుపరి విచారణకు అందరి దృష్టి మళ్లినట్టు కనిపిస్తోంది.
Read Also: India-Pakistan Tension: ఆపరేషన్ సిందూర్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్!