Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు
- Author : Latha Suma
Date : 22-04-2024 - 10:43 IST
Published By : Hashtagu Telugu Desk
Raja Singh: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh). ఆయనపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. చాలా వ్యవహారాల్లో కేసులు కూడా నమోదయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
అయితే తాజాగా రాజా సింగ్‌పై మరో కేసు నమోదు(Registration of case) అయింది. సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద రాజాసింగ్ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో ఆయన ఎన్నికల నియమావళి ఉల్లఘించినట్లు ఎస్‌ఐ మధుసూధన్ పేర్కొన్నారు. ఐపీసీ 188,290 రెడ్ విత్ 34, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 18వ తేదీన కేసు నమోదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Pawan Kalyan : పవన్ కల్యాణ్ సభలో.. కత్తులతో ఇద్దరు యువకుల హల్‌చల్ !
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజాసింగ్ వివాదంతో ఏకంగా పార్టీ కొన్ని రోజులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే మరోసారి ఆయన వివాదంలో చిక్కుకున్నారు.