Jeff Bezos Marriage : అమెజాన్ అధిపతి రెండో పెళ్లి.. మొదటి భార్య సంగతేంటి ?
ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో పెళ్లికి (Jeff Bezos Marriage) రెడీ అవుతున్నారు..
- By pasha Published Date - 09:10 AM, Tue - 23 May 23

ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో పెళ్లికి (Jeff Bezos Marriage) రెడీ అవుతున్నారు..మొదటి భార్య మెకంజీ స్కాట్ తో 25 ఏళ్ల దాంపత్య జీవితానికి 2019లో విడాకులతో ముగింపు పలికిన బెజోస్.. నాటి నుంచి జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్ తో డేటింగ్ లో ఉన్నారట.. ఇప్పుడు ఆమెనే బెజోస్ పెళ్లాడబోతున్నారట.. ఈక్రమంలో ఇటీవల లారెన్ శాంచెజ్ తో బెజోస్ కు మ్యారేజ్ ఎంగేజ్ మెంట్ కూడా కంప్లీట్ అయిందట. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన వీరిద్దరూ.. అక్కడే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వినిపిస్తోంది. ఈసందర్భంగా (Jeff Bezos Marriage) లారెన్ శాంచెజ్ కు బెజోస్ ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారట. అదేమిటి.. దాని ధర ఎంత అనేది తెలియరాలేదు.
also read : Atheletes: ప్రపంచ కుబేరులు జిమ్‌లో ఎలా వర్కౌట్లు చేస్తున్నారో చూడండి
మొదటి భార్యకు రూ. 3లక్షల కోట్ల పరిహారం
జెఫ్ బెజోస్ సంపద రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు తన మొదటి భార్య మెకంజీ స్కాట్ కు విడాకులు ఇచ్చిన సందర్భంగా రూ. 3లక్షల కోట్లు పరిహారంగా చెల్లించాడు. రూ. 3లక్షల కోట్లకు సమానమైన అమెజాన్ కంపెనీలోని 25 శాతం స్టాక్స్ ను మెకంజీ స్కాట్ కు రాసిచ్చారు. దీంతో ఆమె ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న మహిళగా మారిపోయింది. అన్నట్టు ..బెజోస్ కు మొదటి భార్య ద్వారా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
also read : Food Habits: టెక్ బిలియనీర్ల క్రేజీ ఫుడ్ హ్యాబిట్స్ చిట్టా ఇదిగో..
మెకంజీ స్కాట్.. రెండో పెళ్లి
బెజోస్ విడాకులు ఇవ్వగానే బెజోస్ మొదటి భార్య మెకంజీ స్కాట్.. కెమెస్ట్రీ టీచర్ డాన్ జెవెట్‌ను రెండో పెళ్లి చేసుకుంది. 2021 మార్చిలో ఈ మ్యారేజ్ జరిగింది. అయితే ఈ బంధం కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే (2022 సెప్టెంబర్‌లో) అతడి నుంచి సైతం విడిపోయింది.

Tags
- Amazon founder
- broadcast journalist
- business
- Cannes Film Festival
- first wife
- girl friend
- Jeff Bezos Marriage
- Lauren Sanchez

Related News

Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!
మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలనుకుంటే ఈ రోజు మేము మీ కోసం ఒక కొత్త వ్యాపార (Business) ఆలోచనను తీసుకువచ్చాం. దీనిలో మీరు పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.