Hello Alexa: అలెక్సా అదుర్స్.. పిల్లల్లో పెరుగుతున్న కమ్యూనికేషన్!
ఇంటిలో Alexaను వాడితే అది తమ పిల్లల కమ్యూనికేషన్ నైపుణ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
- Author : Balu J
Date : 25-04-2023 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
చాలామంది ఇళ్లలో ఈ మధ్య తరుచుగా వినిపిస్తున్నం పదం అలెక్సా. అలెక్సా సాయంతో ఇంట్లోని ఎన్నో పనులు చక్కబెట్టుకోవచ్చు. అంతేకాదు.. త్వరగా పనులు చేసేందుకు కూడా హెల్ప్ చేస్తోంది. ఇప్పటి వరకు పెద్దలకు బాగా ఉపయోగ పడిన ఈ డివైజ్ పిల్లల కమ్యూనికేషన్ పెంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. అమెజాన్ కోసం మార్చి 2023లో కాంటార్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 95%మందికి పైగా తల్లిదండ్రులు, ఇంటిలో Alexaను వాడితే అది తమ పిల్లల కమ్యూనికేషన్ నైపుణ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
తమ చిన్నారులు మానసికంగా చురుగ్గా ఉండటంతో పాటుగా నూతన అంశాలను అభ్యసించడం, మరింత స్వతంత్య్రంగా ఉండటం అలవడుతుందంటున్నారు. చిన్నారులు నిద్రకు ముందు కథలు వినడం చాలా సహజం. అయితే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు నిద్రపోయే ముందు అలెక్సా ద్వారా కథలు చెబుతూ గాఢ నిద్రలోకి తీసుకెళ్తున్నారు. ఇంగ్లీష్, హిందీ భాషలలో కేవలం ‘Alexa, టెల్ మీ బెడ్ టైమ్ స్టోరీ’, ‘Alexa ఓపెన్ చిల్డ్రన్ స్టోరీస్ ’ పిల్లలు ఇష్టమైన కథలు వింటున్నారని తేలింది. నర్సరీ రైమ్స్ ప్లే చేయమని కోరవచ్చు. చిన్నారుల మ్యూజిక్ మొదలు మెయిన్‌స్ట్రీమ్ హిట్స్ వరకూ, తల్లిదండ్రులు తమ చిన్నారులు నృత్యంచేయడానికి, పాటలు పాడటానికి కూడా వాడొచ్చు. తద్వారా ఇంటిలోనే వినోదం అందించవచ్చు.
‘‘చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు Alexaను చురుగ్గా వాడుతున్నారు. నర్సరీ పద్యాల నుంచి ఇంటరాక్టివ్ గేమ్స్, అక్బర్ మరియు బీర్బల్ కథలు నుంచి చరిత్ర గురించిన ప్రశ్నలు, సైన్స్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, పదాల అర్థాల గురించి Alexa వాడుతున్నారు. Alexa అభ్యాసం, వినోదానికి అత్యున్నత వనరుగా నిలుస్తుంది’’ అని Amazon Devices India డైరెక్టర్ అండ్ కంట్రీ మేనేజర్ పరాగ్ గుప్తా అన్నారు.
Also Read: Samantha Mark List: నటనలోనే కాదు.. చదువులోనూ టాప్, సమంత టెన్త్ క్లాస్ రిపోర్ట్ చూశారా!