HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ahmedabad Plane Crash Prime Minister Modi Inquires

Flight Crash : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. ప్రధాని మోడీ ఆరా

అదేవిధంగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డీజీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరినట్లు పౌరవిమానయానశాఖ వర్గాలు వెల్లడించాయి.

  • Author : Latha Suma Date : 12-06-2025 - 3:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ahmedabad plane crash.. Prime Minister Modi inquires
Ahmedabad plane crash.. Prime Minister Modi inquires

Flight Crash : గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. పౌరవిమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడితో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్ చేయాలని కేంద్రమంత్రికి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డీజీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరినట్లు పౌరవిమానయానశాఖ వర్గాలు వెల్లడించాయి.

Read Also: Ahmedabad Plane Crash: కేవ‌లం 2 నిమిషాల్లోనే క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం!

అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. లండన్‌కు బయలుదేరే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చెట్టు ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక, అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. తదుపరి నోటీసులు జారీ చేసేవరకు విమానాశ్రయం కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయని ఎయిర్‌పోర్టు ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అమిత్ షా తదితరులు ఈ ప్రమాదంపై సమీక్షలు నిర్వహించి, బాధితులకు సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ విమానంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్నాట్టు సమాచారం. ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్‌ తొలుత నెట్టింట వైరల్‌గా మారింది. అందులో బోర్డింగ్‌ సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆయన విమానం ఎక్కినట్లు నిర్ధరించే ప్యాసింజర్‌ జాబితాలోనూ రూపానీ పేరు ఉంది. లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్‌ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్‌ చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఆయన పరిస్థితి ఎలా ఉన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

Read Also: Ukraine : రష్యా డ్రోన్ల నిరోధానికి ఉక్రెయిన్ సరికొత్త పథకం

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahmedabad
  • Air India plane crashes
  • Flight Crash
  • Former Gujarat CM Vijay Rupani
  • pm modi

Related News

BCCI Announces IPL 2026 Playoffs schedule

IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ టోర్నీ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న తుదిపోరు జరగనుంది. 70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ పోరులో భాగంగా మే 26న ధర్మశ

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd