Actress Madhavi Latha : ఆ హీరోకు నాలుగో భార్యగా ఉండాల్సినదానివి.. వైసీపీ కార్యకర్త కామెంట్‌పై మాధవీలత సూపర్ రియాక్షన్
సోషల్ మీడియాలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఊరు పేరు లేని ఫేక్ ప్రొఫైల్స్ నుంచి రాజకీయ నాయకులు, సినీనటులకు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం ఈ మధ్య కామనైపోయింది.
- By Hashtag U Published Date - 03:57 PM, Mon - 28 February 22

సోషల్ మీడియాలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఊరు పేరు లేని ఫేక్ ప్రొఫైల్స్ నుంచి రాజకీయ నాయకులు, సినీనటులకు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం ఈ మధ్య కామనైపోయింది. చిన్నస్ధాయి నేత నుంచి ఏకంగా ప్రధాని వరకూ.. చోటా నటుడి నుంచి పెద్ద పెద్ద హీరో హీరోయిన్ల వరకూ ప్రతీ వారికి ఈ బధ తప్పడం లేదు. ఆ మధ్య ఇలానే తనపై కామెంట్ చేసిన వాళ్లకు యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి గట్టిగానే సమాధానమిచ్చారు. తాజాగా నటి, బీజేపీ నేత మాధవీ లతకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే, ఆమె కూడా తనపై వచ్చిన కామెంట్‌ని లైట్ తీసుకోలేదు. పాము విరగకుండా కర్ర చావకుండా ఉండే రిప్లయ్ ఇచ్చింది.
ఇక అసలు విషయానికొస్తే బీజేపీ నేత మాధవీ లత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన పార్టీ కార్యక్రమాలతో పాటు పర్సనల్ ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. రెండ్రోజుల క్రితం 2021 ఫోటోలు అంటూ ఓ ఆల్బమ్‌ని షేర్ చేసింది మాధవీలత. దాని కింద వైసీపీ కార్యకర్త నాగేంద్రరెడ్డి ఓ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌ని కింద మీరు చదవచ్చు.
మాధవీ లత కూడా ఈ కామెంట్‌కి గట్టిగానే కౌంటరిచ్చింది. ఇష్టాఇష్టాలు తన పర్సనల్ వ్యవహారమని, కట్టుబొట్టు చూసి మనిషిని అంచనా వేయడం మానుకోవాలని చెప్పింది. కామెంట్ పెట్టిన వ్యక్తికి త్వరగా నయం కావాలని దేవుడిని వేడుకుంటున్నట్టు కామెంట్ చేసింది.
గతంలో చాలా సార్లు బీజేపీ నేత మాధవీలత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. పారాసిటమాల్ కామెంట్‌లోనూ వైసీపీ కార్యకర్తలను ఆమెను ఘెరంగా ట్రోల్ చేశారు. అప్పటి నుంచి మాధవీలత ఫేస్‌బుక్ ప్రొఫైల్‌పై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కామెంట్లు పెడుతున్నారు.