HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Actions Will Be Taken If False Propaganda Is Done At Will Br Naidu

TTD : ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: బీఆర్‌ నాయుడు

తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • By Latha Suma Published Date - 02:57 PM, Mon - 13 January 25
  • daily-hunt
Actions will be taken if false propaganda is done at will: BR Naidu
Actions will be taken if false propaganda is done at will: BR Naidu

TTD : ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన గురించి కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. సోమవారం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ బీ.ఆర్ నాయుడు మాట్లాడుతూ.. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టవంతమైన ఘటనగా పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పరిహారం అందజేశామని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు మూడు ప్రత్యేక బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు చెక్కులను అందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొన్నారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 31 మందికి చెక్కులు ఇవ్వడం జరిగిందని… మరో 20 మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి మరో రెండు రోజుల్లో చెక్కులను అందజేస్తామన్నారు. తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక..టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను బీఆర్‌ నాయుడు తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు.

కాగా.. ఈనెల 8న వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ తొమ్మిది ప్రాంతాల్లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా గురువారం (జనవరి 10) తెల్లవారుజామున కౌంటర్లు తెరవాలని భావించినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బుధవారం రాత్రికే కౌంటర్లను ఓపెన్ చేయాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మూడు ప్రాంతాల్లో ఒక్కసారిగా గేట్లు తెరుచుకున్నాయి. భక్తులు కౌంటర్ కేంద్రాల వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.

Read Also: Spinach Juice: శీతాకాలంలో ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎముకలు ఉక్కులా మారాల్సిందే!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fake news
  • tirupati stampede
  • ttd
  • TTD Chairman BR Naidu

Related News

TTD

TTD: తిరుమ‌ల శ్రీవారి భక్తుల‌కు శుభ‌వార్త‌..!

జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఎలక్ట్రానిక్ డిప్ కోసం), అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

  • High Court angered by AP Education Commissioner

    AP Police Department : పోలీస్ శాఖను మూసేయడం బెటర్ – హైకోర్టు అసంతృప్తి

Latest News

  • Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

  • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

  • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd