Rajnath Singh : అవినీతిపరుడైన సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించలేరు: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh : ఝార్ఖండ్‌లో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసేందుకు బీజేపీకి వరుసగా రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- By Latha Suma Published Date - 06:18 PM, Thu - 26 September 24

Union Defense Minister Rajnath Singh : ధన్‌బాద్‌లో నిర్వహించిన సభలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొద్ది నెలల్లో జరగబోయే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిష్క్రమించడం ఖాయమని.. భూమిపై ఉన్న ఏ శక్తీ దాన్ని ఆపలేదని అన్నారు. 2027 నాటికి అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రపంచ ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గొప్ప వీరుడిలా నటిస్తున్నారని విమర్శించారు.
Read Also: Pawan Kalyan ‘Prayaschitta Diksha’ : పవన్ కళ్యాణ్ దీక్ష పై సీమాన్ సంచలన వ్యాఖ్యలు
అవినీతిపరుడైన సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించలేరని రాజ్‌నాథ్ అన్నారు. ఝార్ఖండ్‌లో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసేందుకు బీజేపీకి వరుసగా రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ”మేం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అందరికీ ఇళ్లు నిర్మిస్తాం. జేఎంఎం, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లు ఝార్ఖండ్ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వల్ల విదేశాల్లో భారతదేశం పరువు దిగజారింది” అని రాజ్‌నాథ్ మండిపడ్డారు. ఝార్ఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జనవరి 5 వరకు గడువు ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.