High Court : ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. లగచర్ల, హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ రద్దు
బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారంటూ బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. హకీంపేటకు చెందిన శివకుమార్ బాధితుల తరఫున పిటిషన్ వేయగా.. అడ్వొకేట్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
- Author : Latha Suma
Date : 06-03-2025 - 2:26 IST
Published By : Hashtagu Telugu Desk
High Court : లగచర్ల, హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. భూసేకరణపై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు లగచర్ల, హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తక్షణమే భూసేకరణ ఆపేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట పరిధిలో 8 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా.. బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారంటూ బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. హకీంపేటకు చెందిన శివకుమార్ బాధితుల తరఫున పిటిషన్ వేయగా.. అడ్వొకేట్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
Read Also: Posani : పోసానిపై కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దు : ఏపీ హైకోర్టు
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం భూసేకరణపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ధర్మాసనం. కాగా, దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 1177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉందని దుద్యాల తహసీల్దార్ కిషన్ తెలిపారు.
పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల , పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే పూర్తయింది. పోలేపల్లి రైతులకు నష్టపరిహారం అందించారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటి మంజూరుకు వికారాబాద్ కలెక్టర్రైతులకు హామీ ఇవ్వడంతో భూసేకరణకు అంగీకరించారు. కాగా, గతేడాది నవంబర్ 11న ఫార్మా కంపెనీల ఏర్పాటు సంబంధించి భూసేకరణ కోసం లగచర్ల సమీపంలో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు. వారి వాహనాలను పెద్ద పెద్ద బండరాళ్లతో ధ్వంసం చేశారు.
Read Also: Bujji Thalli Song: నాగ చైతన్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బుజ్జి తల్లి వచ్చేసింది!