YS Sharmila : దొర ఈ పీకుడేంది.!
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోన్న కేసీఆర్ అక్కడ రైతులు, వీరమరణం పొందిన జవాన్ కుటుంబాలకు ఇస్తోన్న ఆర్థిక సహాయంపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఘాటుగా స్పందించారు.
- By CS Rao Published Date - 05:00 PM, Mon - 23 May 22

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోన్న కేసీఆర్ అక్కడ రైతులు, వీరమరణం పొందిన జవాన్ కుటుంబాలకు ఇస్తోన్న ఆర్థిక సహాయంపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఘాటుగా స్పందించారు. తెలంగాణలో రైతుల, విద్యార్థుల ఆత్మహత్యలు గురించి ఎందుకు పట్టించకోవంటూ నిలదీశారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చిన ఆయన ఇంట్లో ఈగత మోత బయట పల్లకీ మోత అన్నట్టు దేశ పర్యటన చేస్తున్నారని విమర్శించారు. ఆమె ట్వీట్లు చేస్తూ కేసీఆర్ దేశ పర్యటనపై సెటైర్లు వేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పంజాబ్ లో పర్యటించి రైతుల కుటుంబాలకు సాయం చేయనున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. `తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి, విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసల్ రావు కానీ తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా? పంట దిగుబడి లేక, పెట్టుబడి రాక మీరు ఆదుకొంటారనే ఆశ చచ్చి సిద్ధిపేట రైతు మల్లేశం ఆత్మహత్య చేసుకొన్నాడు. 11 లక్షల అప్పు తెచ్చి పంచాయతీ పనులు చేస్తే, చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచ్ ఎల్లయ్య చావడానికి ప్రయత్నించిండు. దేశాన్నేలపోవాలన్న మీ దురదకు తెలగాణ బిడ్డలను ముంచకు దొరా“ అని షర్మిల ట్వీట్ చేశారు.
తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి,విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసల్ రావు కానీ తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా? పంట దిగుబడి లేక పెట్టుబడి
రాక మీరు ఆదుకొంటారనే ఆశ 1/2 pic.twitter.com/DhhTKBpSyw— YS Sharmila (@realyssharmila) May 22, 2022