HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila Reacts On Brs 115 Mlas List Accuses Mlc Kavitha

Telangana: మహిళల రిజర్వేషన్ పై కవితమ్మ చిలక పలుకులు: షర్మిల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వాడివేడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల వేటలో పడ్డాయి. తాజాగా బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్ధుల జాబితాని ప్రకటించింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 23-08-2023 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
New Web Story Copy (81)

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వాడివేడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల వేటలో పడ్డాయి. తాజాగా బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్ధుల జాబితాని ప్రకటించింది. 115 స్థానాలకు గానూ సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల జబితాను విడుదల చేశారు. అయితే అందులో కేవలం 7 స్థానాల్లో మాత్రమే మహిళలు ఉన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన ఎమ్మెల్సీ కవితమ్మ ఎక్కడికి పాయె అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా అని సూటిగా ప్రశ్నించారు. ఆకాశం,అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా కవితమ్మ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలి అంటూ పేర్కొన్నారు.

తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా క్యాబినెట్ లోనూ ప్రాధాన్యత దక్కలదని మండిపడ్డారు. లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్ లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన స్పందించిన పాపాన పోలేదు.. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదు.. మీ దృష్టిలో మహిళలు వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు కాదు.. . నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలి. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవితమ్మ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల.

Also Read: Vijay Deverakonda: ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: రౌడీ బాయ్ షాకింగ్స్ కామెంట్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 115 seats
  • 33 reservation
  • 7 seats
  • brs
  • kavitha
  • kcr
  • telangana
  • women
  • ys sharmila

Related News

    Latest News

    • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

    • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd