Sharmila And Jagan: అక్కడ అన్న.. ఇక్కడ చెల్లి.. సేమ్ టు సేమ్
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించారు.
- By Balu J Published Date - 01:24 PM, Wed - 7 September 22

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించారు. రాజశేఖర్ కూతురు వైఎస్ షర్మిల సైతం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకునే ప్రయత్నం చేస్తోంది. రైతు సమస్యలపై పోరాటం చేస్తూ సమస్యలను పరిష్కరించేందకు కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. తెలంగాణలో వైస్సాఆర్ టీపీ పార్టీని స్థాపించిన షర్మిల తన జగన్ స్టైల్ ను కాపీ కొడుతోంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్.. పాదయాత్ర సమయంలో రైతులతో మమేకమయ్యారు.
రైతులను ఆకర్షించి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రైతులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సీఎం జగన్ పై వస్తున్నాయి. ప్రస్తుతం షర్మిల కూడా తన అన్న జగన్ బాటలో నడుస్తోంది. పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో షర్మిల భోజనం చేసిన ఫొటోలు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే అధికారంలోకి రావడం కోసమే ఇలాంటి ఫీట్లు చేస్తుందని పలువురు తెలంగాణ రాజకీయ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజలను ఎనిమిదేళ్లుగా మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. పాలమూరు-రాణాగరెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుతూ మహబూబ్‌నగర్‌లో ఆందోళన చేపడతామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తూ సుద్దకల్ గ్రామంలో పర్యటించారు. పాదయాత్ర సందర్భంగా రైతు కూలీలతో మాట్లాడి జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కూలీలు వైఎస్ షర్మిలతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలనను తీసుకువస్తానని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.
YSR బిడ్డపై మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలు వెలకట్టలేనివి. YSR తెలంగాణ పార్టీకి తొలి ప్రాధాన్యం ప్రజలే.వారి ముఖాల్లో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం. ప్రజాప్రస్థానం పాదయాత్రలో నన్ను బిడ్డగా ఆదరించి, గోరుముద్దలు తినిపించిన అవ్వలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.#PrajaPrasthanam #Kalwakurthy pic.twitter.com/XktCPBxtgF
— YS Sharmila (@realyssharmila) September 6, 2022