HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila Alleged Kcr On Kokapet Lands

Telangana: తెలంగాణలో దొర గారి భూదందాలు: షర్మిల

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ వైఎస్ షర్మిల మాటలు తూటాల్లా పేల్చుతున్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్టీపి పార్టీ నెలకొల్పి సీఎం కేసీఆర్ మరియు ఆ పార్టీని ఎండగడుతున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 17-08-2023 - 5:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
New Web Story Copy (26)

Telangana: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ వైఎస్ షర్మిల మాటలు తూటాల్లా పేల్చుతున్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్టీపి పార్టీ నెలకొల్పి సీఎం కేసీఆర్ మరియు ఆ పార్టీని ఎండగడుతున్నారు. రోజుకో అంశంపై షర్మిల కేసీఆర్ ని దుయ్యబడుతున్నారు. నిన్నటికి నిన్న ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కోట్లు నొక్కేశాడని ఆరోపించారు. ఈ రోజు భూముల దందాపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అడిగేటోడు లేడని సర్కారీ భూములపై దొర ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కావాల్సింది కాజేయడం, ఉన్నది అమ్మేయడమే కేసీఆర్ చేస్తున్నది అంటూ ఎద్దేవా చేశారు. భూదందాలకు పాల్పడుతూ.. తనకు నచ్చిన రేటుకే అమ్మకానికి పెట్టి ఆయనే కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. కబ్జాలు చేస్తూ ప్రజలకు మాత్రం కాంపిటీషన్ పెడుతున్నడు అంటూ ఫైర్ అయ్యారు. జిల్లాల్లో పార్టీ ఆఫీసుల పేరిట రూ.వెయ్యి కోట్లు విలువ జేసే 33.72ఎకరాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశారని విమర్శించారు షర్మిల. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో దొర గారి భారతీయ భవన్ కోసం రూ.3.41 కోట్లకే 11ఎకరాలు దోచేశారని ఆరోపించారు. దాదాపు రూ.1100 కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా పార్టీ ఆఫీసుకు లాక్కున్నారు.

ప్రభుత్వ పనులకు పనికొచ్చే భూములన్నీ దొర గారి సొంత పార్టీ అవసరాలకు,ఆయన బినామిలకు ఉపయోగ పడుతున్నయని అన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా, జనం దుమ్మెత్తిపోసినా తుడుచుకొనిపోతున్నాడు కానీ దొర గారిలో మార్పు రావడం లేదని ఘాటైన వ్యాఖ్యలకు పాల్పడ్డారు షర్మిల. కేసీఆర్ .. నువ్వు రాయించుకున్న అత్యంత విలువైన కొకపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయాలనీ డిమాండ్ చేశారు. లేదా ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.11వందల కోట్లను మీ పార్టీ అకౌంట్ లో మూలుగుతున్న రూ.12వందల కోట్ల నుంచి కట్టాలని వైఎస్ షర్మిల సూచించారు.

Also Read: BJP: మధ్యప్రదేశ్‌లో 39 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • hyderabad
  • KCR Scams
  • kokapet lands
  • telangana
  • ys sharmila

Related News

    Latest News

    • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

    • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

    • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

    • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

    • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd