Tragedy : లోకం ఎటు పోతోంది.. చాయ్ పెట్టలేదని కోడలిని చంపిన అత్త
రోజు రోజుకు మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. హైదరాబాద్ హసన్‌నగర్‌లో అజ్మిరా బేగం హత్య కేసులో పోలీసులు వివరాలు వెల్లడించారు.
- Author : Kavya Krishna
Date : 28-06-2024 - 9:40 IST
Published By : Hashtagu Telugu Desk
రోజు రోజుకు మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. హైదరాబాద్ హసన్‌నగర్‌లో అజ్మిరా బేగం హత్య కేసులో పోలీసులు వివరాలు వెల్లడించారు. చాయ్ పెట్టలేదని కోడలిని అత్త చంపినట్లు నిర్ధారించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట వాసి అజ్మిరా(28)కు ఓల్డ్సటీ నివాసి అబ్బాస్తో వివాహమైంది. తరచూ అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరిగేవి. గురువారం చాయ్ పెట్టమంటే పట్టించుకోలేదన్న కోపంతో కోడలిపై ఫర్జానాబేగం దాడి చేసింది. చున్నీతో ఉరేసి చంపేసినట్లు అత్తాపూర్ పోలీసులు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఓ లారీ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు . లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో వెనుక లారీ క్యాబిన్‌లో కూర్చున్న నలుగురు దురదృష్టవశాత్తు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు కాగా, వారిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా విచారణలో ఉంది, ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Delhi Airport Roof Collapses: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు!