Hyderabad : ఈఎస్ఐ హాస్పటల్ లో యువతిపై అత్యాచారం
శుక్రవారం రాత్రి భోజనం కోసం ఆరో అంతస్తు నుంచి కిందికొచ్చింది. ఆ సమయంలో క్యాంటీన్ బాయ్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి తీరుకు విసిగిపోయిన ఆమె..హెచ్చరించింది. అయినప్పటికీ అతడు వినకుండా ఆమెను బలవంతగా
- By Sudheer Published Date - 02:27 PM, Sun - 17 September 23

హైదరాబాద్ (Hyderabad) లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతీ ఫై క్యాంటిన్ బాయ్ అత్యాచారం (Woman raped by canteen employee) చేసిన ఘటన సనత్ నగర్ ESI హాస్పటల్ లో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన యువతి సోదరుడు జారి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె ఈఎస్‌ఐ హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తుంది. రెండు , మూడు రోజులుగా ఆమెనే దగ్గరుండి అతన్ని చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భోజనం కోసం ఆరో అంతస్తు నుంచి కిందికొచ్చింది.
ఆ సమయంలో క్యాంటీన్ బాయ్ (Canteen Employee) ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి తీరుకు విసిగిపోయిన ఆమె..హెచ్చరించింది. అయినప్పటికీ అతడు వినకుండా ఆమెను బలవంతగా గ్రౌండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్లి.. డైట్ సెక్షన్‌లో ఆమెపై అత్యాచారం (Raped ) చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న యువతీ..నేరుగా ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతీపై అత్యాచారం అయినట్టు ఈఎస్ఐ ఆస్పత్రి డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన తో ఒక్కసారిగా హాస్పటల్ వర్గం తో పాటు పేషేంట్లు..మిగతా సిబ్బంది ఇలా అంత కూడా షాక్ లో పడ్డారు. ఇంతజరుగుతున్న ఎవ్వరు చూడలేదా..? పట్టించుకోలేక అని ప్రశ్నింస్తున్నారు.
Read Also : CWC Meeting: కాంగ్రెస్ లో చేరిన టీడీపీ లీడర్