Stray Dogs : చిత్రపురి కాలనీలో మహిళపై 15 కుక్కల దాడి
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కలు దాడి చేశాయి. అన్ని కుక్కలు దాడికి ఎగబడటంతో.. ఆ మహిళ గుండెలు జారిపోయాయి
- By Sudheer Published Date - 08:53 PM, Sat - 22 June 24
![Stray Dogs : చిత్రపురి కాలనీలో మహిళపై 15 కుక్కల దాడి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Woman-attacked-by-stray-dog.jpg)
హైదరాబాద్ (Hyderabad) లో వీధికుక్కలు (Stray Dogs) బెడద రోజు రోజుకు ఎక్కువైపోతోంది..ఒంటరిగా వెళ్లాలంటే భయం వేస్తుంది. ఎక్కడి నుండి ఎన్ని కుక్కలు దాడి చేస్తాయో అర్ధం కావడం లేదు. కుక్కలా దాడిలో పలువురి మరణాలు , గాయాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ వీటిని అరికట్టడం లో మున్సిపాలిటీ నిర్లక్ష్యం వహిస్తుంది. తాజాగా చిత్రపురి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళా ఫై ఏకంగా 15 కుక్కలు దాడి చేసాయి.
We’re now on WhatsApp. Click to Join.
చిత్రపూరి కాలనీలో ఈరోజు (జూన్ 22న) ఉదయం 6 గంటల సమయంలో.. వాకింగ్ కోసం తన ఇంటి దగ్గర్లోని గ్రౌండ్‌కి స్కూటీపై వెళ్లిన ఓ మహిళ తన వాహనాన్ని పార్క్ చేసి ఒంటరిగా వెళ్తుండగా.. ఒక్కసారిగా వీధి కుక్కలు దాడికి ఎగబడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కలు దాడి చేశాయి. అన్ని కుక్కలు దాడికి ఎగబడటంతో.. ఆ మహిళ గుండెలు జారిపోయాయి. చుట్టుముట్టిన ఆ కుక్కలను చూసి వెన్నులో వణుకు పుట్టినా.. చుట్టుముట్టిన కుక్కలను వెళ్లగొట్టేందుకు సాయాశక్తులా ప్రయత్నించింది. రెండు చేతులా వాటిని తరిమికొడుతూ.. దాడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు యత్నించింది. సాయం కోసం అరుస్తూనే.. ప్రాణాలు కాపాడుకునేందుకు ధైర్యంగా వాటితో సుమారు అరగంటసేపు పోరాటం చేసింది. మధ్యలో.. ఆ మహిళ్ల ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. ఆమెపైకి కుక్కలు గుంపుగా ఎగబట్టాయి. అయినా సరే.. ఆమె క్షణాల్లోనే ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్లీ వాటిపై యుద్ధం కొనసాగించింది. ఇంతలో అదే మార్గంలో ఓ ద్విచక్రవాహనదారుడు రావడంతో వీధికుక్కలు పరుగులు తీశాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డయ్యాయి.
Woman Attacked by Pack of Dogs in Hyderabad's Manikonda Area
Ia harrowing incident on Saturday morning, a woman was attacked by approximately 15 stray dogs while on her morning walk at Chitrapuri Hills in Manikonda. The attack occurred around 6 a.m. and has raised serious… pic.twitter.com/CyljwZSGh2
— Sudhakar Udumula (@sudhakarudumula) June 22, 2024
Read Also :
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/07/hyd-rain-again.jpg)
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain In Hyderabad: తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో గత గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. ఈ వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రా