HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Without Kcr There Is No Telangana Kcr Cannot Separate Telangana

Harish Rao: కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు

  • Author : Balu J Date : 12-01-2024 - 1:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ZP చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలతో మాట్లాడారు.

‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరే. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామలు అభివృద్ధి చెందినయి. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది, రైతుబంధు, రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్’’ అని హరీశ్ రావు తెలిపారు.

‘‘ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో  పనిచేస్తాం. మనోహరాబాద్‌ను మండలం చేసింది కేసీఆర్. కాని ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నది. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా! కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గజ్వేల్‌ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారు. మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారు’’ ఆయన మండిపడ్డారు.

‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం. నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం. వారి పక్షాన పోరాడతాం. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లు. బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరు. ఆరోపణలు మాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతాం’’ అని హరీశ్ రావు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao

Related News

    Latest News

    • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

    • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd