Wine Shops Close : జులై లో 2 రోజులు వైన్ షాప్స్ బంద్..?
ఏడాది గా ఎక్కువగా వైన్ షాప్స్ బంద్ అవుతుండడం తో మందు బాబులో వైన్ షాప్స్ బంద్ ఫై ఆసక్తి పెరుగుతుంది
- By Sudheer Published Date - 11:34 PM, Thu - 4 July 24

సాధారణంగా నెల మారిందంటే బ్యాంకు ఖాతాదారులు , గ్యాస్ వినియోగదారులు , మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నెలలో బ్యాంకు సెలవులు ఎప్పుడు ఉన్నాయి..? గ్యాస్ సిలెండర్ ధర పెరిగిందా..తగ్గిందా..? పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయ్..? వంటివి తెలుసుకునేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. అయితే ఈ మధ్య తెలంగాణ మందుబాబులు ఈరోజు వైన్ షాప్స్ బంద్ అవుతున్నాయి..? ఏ ఏరియా లో బంద్ అవుతున్నాయి…? ఎందుకు బంద్ అవుతున్నాయి..? ఎన్ని రోజులు బంద్ అవుతాయి..? వంటివి తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏడాది గా ఎక్కువగా వైన్ షాప్స్ బంద్ అవుతుండడం తో మందు బాబులో వైన్ షాప్స్ బంద్ ఫై ఆసక్తి పెరుగుతుంది. ఎన్నికల కారణంగా..పలు పండగల కారణంగా హైదరాబాద్ నగరంలో వైన్ షాప్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో మందు బాబులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉదయాన్నే పెగ్ వెయ్యండి పని చేయని మందు బాబులు..వరుసగా వైన్ షాప్స్ క్లోజ్ కావడం తో బ్లాక్ లో ఎక్కువ పెట్టి కొనుగోలు చేసి తాగి ఇబ్బంది పడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
అందుకే వైన్ షాప్స్ ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయో దానిని చూసుకొని స్టాక్ పెట్టుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ నెల లో రెండు రోజుల పాటు నగరంలో వైన్ షాప్స్ మూతపడబోతాయని తెలుస్తుంది. జులై 17, 27. జులై 17వ తేదీ మొహరం.. ఆ రోజు లిక్కర్ షాప్స్ మూతపడనున్నాయి. అలాగే జులై 27న బోనాల పండుగ సందర్భంగా బంద్ కాబోతున్నాయి. ఈ రెండు రోజులు లిక్కర్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. జూలై నెలలో ఈ రెండు రోజుల్లో మద్యం ప్రియులకు చుక్క లిక్కర్ కూడా దొరికే అవకాశాలు లేవు. అసలే పెద్ద పండుగ .. ముక్కతో పాటు చుక్క పడనిదే పండగ పండగా లాగా ఉండదు. అందుకే ఈ రెండు పండగల ముందు రోజే తమకు కావాల్సిన సార్క్ స్టాక్ పెట్టుకోవడం గ్యారెంటీ.
Read Also : Keshava Rao : ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేశవరావు..?