HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will Trs Join Hands With Congress In Telangana

Telangana Politics: కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీచేయడం కన్ఫర్మేనా ?

  • Author : Siddartha Kallepelly Date : 09-02-2022 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయని రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాకా ప్రతి విషయంలో విమర్శించుకున్న ఈ ఇరు పార్టీలు కాస్త సైలెంట్ అవ్వడానికి రెండు పార్టీల అగ్రనాయకుల మధ్య‌ చర్చలు జరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేంద్రంలో బీజేపీని కాంగ్రెస్ సింగిల్ గా ఎదుర్కొనే పరిస్థితి లేదు. కాబట్టి కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లాలనేది కాంగ్రెస్ ఆలోచన ఇప్పటికే టీఆర్ఎస్ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు సాధారణ ఎన్నికల్లో జాతీయ ప్రయోజనాలకు సంబందించిన చర్చ ఉంటుంది. రాష్ట్రంలో బీజేపీ మెల్లిమెల్లిగా ఏమర్జ్ అవుతోంది కాబట్టి సాధారణ ఎన్నికలకు వెళ్తే బీజేపీపుంజుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఒంటరిగా వెళ్తే టీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ చెప్పారని, కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేస్తే బాగుంటుందని పీకే టీం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లీకులు తెలిపినట్టు ఎన్నికలకు ముందు అలయన్స్ లేకపోయినా పోస్ట్ అలయెన్స్ అయినా ఉండొచ్చని రెండు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ ఈ మధ్య మాట్లాడుతున్న మాటల్లో బీజేపీని కూకటివెళ్లతో సహ పీకేయాల్సిన అవసరాన్ని, దేశం బాగుపడాలంటే బిజెపిని గద్దె దించాలని పలుమార్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా ఇదే. అయితే బిజెపిని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కు లేదు కాబట్టి కారులో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నట్లు నిర్ణయించుకోవాలని డిసైడైనట్టు సమాచారం. దానిలో భాగంగానే ఇటీవల కాజీపేట రైల్వే కోచ్ విషయంలో రెండు పార్టీలు కలిసి బిజెపిని కార్నర్ చేయడం వారి అలయెన్స్ కు మొదటి స్టెప్ అనుకోవచ్చు. ఇటీవల పార్లమెంట్ లో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను సరైన పద్దతిలో విభజించలేదని వాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టీఆర్ఎస్ రియాక్ట్ అయింది. తెలంగాణపై అక్కసు వెళ్లగక్కిన మోదీ దిష్టి బొమ్మలను రాష్ట్రవ్యాప్తంగా తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ రియాక్షన్ పై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ కాంగ్రెస్ ని తిడితే కేసీఆర్ కి ఏం నోప్పని విమర్శించారు. ఈ కామెంట్స్ ని బట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయెన్స్ పై కేంద్రానికి సమాచారముందని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణని ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ ఉంది. కాంగ్రెస్ ని డీ ఫేమ్ చేయడానికే మోదీ ఆ విధంగా మాట్లాడారని, తద్వారా టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయెన్స్ కి ఆదిలోనే చెక్ పెట్టొచ్చని మోదీ భావించారని పరిశీలకులు భావిస్తున్నారు. మోదీ, సంజయ్ ల రియాక్షన్ బట్టి కాంగ్రెస్,టీఆర్ఎస్ కలిసి పోటీచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ అదే జరిగితే రాజకీయాల్లో అది భారీ కుదుపుకే దారి తీస్తుందనేది కాదనలేని సత్యం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • chief minister KCR
  • congress
  • telangana politics
  • trs

Related News

Ktr Comments Revanth

నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన

రాహుల్ గాంధీని తాను కొత్తగా ఏం అనలేదని, గతంలో రేవంత్ చెప్పిన మాటలనే తిరిగి అన్నానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫైరవ్వడంపై ఆయన స్పందించారు. 'రాహుల్ పప్పు కాదు ముద్ద పప్పు అని గతంలో రేవంత్ అన్నాడు

  • Sonia Gandhi Hsp

    ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ, పార్టీ శ్రేణుల్లో ఖంగారు !!

Latest News

  • పల్లీలతో స్నాక్స్ ఆరోగ్యానికి మేలా? నష్టమా?.. నిపుణుల సూచనలు ఇవే..!

  • సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

  • అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?

  • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

  • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd