HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will Brs Emerge As The Kingmaker At The Center With 12 Lok Sabha Seats

Kingmaker : 12 లోక్‌సభ సీట్లతో బీఆర్ఎస్ కింగ్‌మేకర్ అవుతుందా ?

Kingmaker : ‘‘మేం పది నుంచి పన్నెండు లోక్‌సభ సీట్లు గెలిస్తే రాజకీయాలు మారిపోతాయి’’ అని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతున్నారు.

  • Author : Pasha Date : 02-05-2024 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kingmaker Brs
Kingmaker Brs

Kingmaker : ‘‘మేం పది నుంచి పన్నెండు లోక్‌సభ సీట్లు గెలిస్తే రాజకీయాలు మారిపోతాయి’’ అని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని అంతటా రిపీట్ చేస్తున్నారు.  ఈ వ్యాఖ్యలతో ప్రజలకు చాలా డౌట్స్ వస్తున్నాయి. 12 లోక్‌సభ సీట్లు అంత పవర్ ఫులా ? వాటి ఎఫెక్టుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్(Kingmaker) ప్రభావితం చేయగలుగుతుందా ? కేంద్రంలో కింగ్ మేకర్‌గా మారి చక్రం తిప్పగలుగుతుందా ?   ఈ అంశాలపై ఓ లుక్ వేద్దాం..

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌ను ఘోరంగా దెబ్బతీశాయి. పదేళ్ల పాలనా కాలం తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ పతనావస్థను చూసింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్‌లో చేరే వారే తప్ప.. బయటికి వెళ్లే నాయకుడు కనిపించలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం వెలువడుతున్న సమయం నుంచే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పర్వం మొదలైపోయింది. రాజకీయ నాయకులు తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి చేరిపోవడం షురూ చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా జరిగే తతంగం ఇదే !!  నేతల వలసలతో ఒక్కసారిగా కుదుపుకు గురైన బీఆర్ఎస్ పార్టీ.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 12 గెలవడం అంటే పెద్ద టార్గెటే. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా 17 లోక్‌సభ స్థానాల్లో 14 సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ దూకుడులో ఉంది. అయినా 14 సీట్ల టార్గెట్‌కు పరిమితమైంది. మిగతా మూడు చోట్ల ఇతరులు గెలవొచ్చని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతమున్న కష్టకాలంలో బీఆర్ఎస్ వ్యూహం తప్పేం కాదని.. 12 లోక్‌సభ సీట్ల టార్గెట్‌ను పెట్టుకుంటే కనీసం 5 స్థానాలైనా గెలవడానికి ఛాన్స్ ఉంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Also Read :CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్

తమకు 12 లోక్‌సభ సీట్లు  వస్తే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా కాపాడుతామని, రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డం పడతామని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్దసంఖ్యలో లోక్‌సభ సీట్లు ఉన్నప్పుడు కూడా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బిల్లును కూడా అడ్డుకోలేకపోయింది. కేవలం నిరసన తెలపడం, వాకౌట్ చేయడం మాత్రమే బీఆర్ఎస్ చేయగలిగింది. సారు .. కారు..  పదహారు అనే నినాదంతో గత లోక్‌సభ ఎన్నికల్లో జనంలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి  9 లోక్‌సభ సీట్లే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు 12 సీట్ల టార్గెట్‌లో ఐదుకు మించి బీఆర్ఎస్ సాధించలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

లిక్కర్ స్కాంలో కవిత..

ఇక కేంద్రంలో కింగ్ మేకర్ కావాలనే ఆశ ఒక్క బీఆర్ఎస్ పార్టీకే కాదు.. వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్, బీఎస్పీ వంటి పార్టీలకు కూడా ఉంది.  కాబట్టి జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీయో కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు లేదు. ఒకవేళ బీఆర్ఎస్ కింగ్ మేకర్‌గా మారే ప్రయత్నం చేస్తే.. అది దాని ఉనికికే ముప్పు తెస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బలమైన శత్రువుగా బీజేపీ కూడా ఎదుగుతోంది. కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిసినా.. బీజేపీతో కలిసినా.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు పరీక్షా కాలం మొదలవుతుంది. రాష్ట్రంలోనూ ఆ పార్టీతో కలిసి నడవాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో సంకీర్ణ శకం దిశగా బీజం పడుతుంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న ప్రస్తుత తరుణంలో ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ పార్టీ తప్పకుండా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరడం కన్ఫామ్ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Also Read : Janasena : అల్లు అర్జున్ కూడా గ్లాస్ పట్టుకున్నాడు..ఇక తగ్గేదెలా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Center Govt
  • Kingmaker
  • lok sabha
  • Lok Sabha seats
  • telangana elections

Related News

Tdp Mp Lavu Sri Krishna Devarayalu

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగ

  • Ap Mlas

    దేశంలో టాప్ 3 మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు.. మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే

  • Brs Car

    Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

  • kaleshwaram-notices-i-will-explain-what-happened-during-kcr-rule-etela-rajender

    Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd