KPHB : ప్రియుడి మోజులో భర్త ను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య
KPHB : గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరి మధ్య మనస్పర్థలు తలెత్తగా, ఇద్దరూ వేర్వేరుగా జీవించటం మొదలుపెట్టారు
- Author : Sudheer
Date : 21-04-2025 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ(KPHB Colony)లో భర్త హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ సంబంధాల మోహంలో భార్య కిరాతకంగా భర్త ప్రాణాలు (Husband lives) తీసింది. సాయిలు (Sailu) అనే వ్యక్తి తన భార్య కవితతో కలిసి కేపీహెచ్‌బీ ప్రాంతంలో నివాసముండేవారు. వీరు ఒక భవనం వద్ద వాచ్‌మెన్ దంపతులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరి మధ్య మనస్పర్థలు తలెత్తగా, ఇద్దరూ వేర్వేరుగా జీవించటం మొదలుపెట్టారు. వీరి మధ్య అవగాహన లోపం, ఒకరిపై మరొకరికి ఉన్న అనుమానాలు వారి బంధాన్ని ప్రమాదకరమైన మలుపు తీసుకెళ్లాయి.
సడెన్ గా సాయిలు కనిపించకుండా పోవడంతో అతడి బంధువులకు అనుమానం కలిగింది. కవిత అతడు ఇంటికి తిరిగిరాలేదని చెప్పినా, ఆమె ప్రవర్తనపై బంధువులకు అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో కవితే తన భర్తను హత్య చేసినట్లు నిజం చెప్పింది. ఆమె అక్రమ సంబంధం ఉన్న వ్యక్తితో కలిసి భర్తను కరెంట్ షాక్‌తో హత్య చేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణ చర్యలో కవిత తన చెల్లెలి భర్త సహాయాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఘటన మరోసారి వివాహేతర సంబంధాల ప్రభావం ఎంత భయంకరంగా ఉండొచ్చో స్పష్టంగా చూపింది.