HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Why Are Land Prices Increasing In Hyderabads Kokapet What Are The Reasons

Kokapet Lands : కోకాపేటలో బంగారు భూములు.. ఎందుకు ?

రూ.60 కోట్ల వ్యయంతో ఔటర్ రింగు రోడ్డుపై కోకాపేట వద్ద ట్రంపెట్‌ జంక్షన్‌ను(Kokapet Lands) నిర్మించారు.

  • Author : Pasha Date : 25-03-2025 - 8:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kokapet Land Cost Land Prices Hyderabad Land Prices

Kokapet Lands : హైదరాబాద్ నగరంలోని కోకాపేట కాస్తా బంగారుపేటగా మారింది. ఎందుకంటే అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అక్కడి భూముల ధరల గురించి వింటే.. మనం ఫారిన్‌లో ఉన్నామా అనిపిస్తుంది. ఆకాశాన్ని తాకే భవనాలు, పెద్ద పెద్ద కంపెనీలతో కోకాపేట రూపురేఖలు మారడంతో ఈ బూమ్ వచ్చింది. అంతేకాదు.. హైదరాబాద్ నగరంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా కోకాపేట అభివృద్ధి చెందుతోంది. ఈ ఏరియాలో ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలు వేగంగా పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ప్రాజెక్టులను అంతే వేగంతో పెంచుతున్నాయి. కోకాపేటకు మంచి రోడ్డు మార్గాలు ఉండటం కూడా, ఇక్కడి భూముల ధరలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది.

Also Read :Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు ఔట్.. ఆరుగురు ఇన్ ?

ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం.. 

ఇతర రాష్ట్రాల వ్యాపారులు, సంపన్నులు, కంపెనీల నిర్వాహకులు ఇక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి ధర రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా ఉంది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉండటం అనేది కోకాపేటకు పెద్ద అడ్వాంటేజీ. ప్రధానంగా ఇంటర్ ఛేంజ్‌ల దగ్గర భూములకు ఎక్కువ డిమాండ్ ఉంది. కమర్షియల్ ల్యాండ్, రెసిడెన్షియల్ ప్లాట్, విల్లా ఈవిధంగా భూములను విభజించి అమ్ముతున్నారు. గతంలో పోలిస్తే ఇక్కడ ఎకరాకు సగటున రూ. 2 కోట్ల దాకా భూముల ధరలు పెరిగాయి.

Also Read :Feet : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే జాగ్రత్త!

కోకాపేట వద్ద ట్రంపెట్‌ జంక్షన్‌

రూ.60 కోట్ల వ్యయంతో ఔటర్ రింగు రోడ్డుపై కోకాపేట వద్ద ట్రంపెట్‌ జంక్షన్‌ను(Kokapet Lands) నిర్మించారు. దీని వల్ల ఓఆర్‌ఆర్‌ నుంచి నేరుగా నియో పొలిస్‌ లేఅవుట్‌లోకి వాహనాలు వెళ్తాయి. కోకాపేటలో 500 ఎకరాల్లో నియో పొలిస్‌ పేరుతో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్‌ వేసింది. ఇందులో భూముల ధర గరిష్ఠంగా ఎకరం రూ.100 కోట్లు పలికింది. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పన కోసం హెచ్‌ఎండీఏ భారీగా డబ్బులు ఖర్చు చేస్తోంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం గృహ, కార్యాలయాల ప్రాజెక్ట్‌లను 50 నుంచి 60 అంతస్తుల దాకా నిర్మిస్తున్నాయి. ఇవన్నీ పూర్తయితే దాదాపు 5 లక్షల మంది కోకాపేట ప్రాంతం నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంత ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా కోకాపేటకు ఓఆర్‌ఆర్‌‌తో అనుసంధానం లేకపోతే ట్రాఫిక్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంపెట్‌ను నిర్మించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Hyderabad Land Prices
  • kokapet
  • Kokapet Land Cost
  • Kokapet Land Prices
  • kokapet lands
  • Land Prices

Related News

Prostate Cancer

Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించకపోవడమే అతిపెద్ద సవాలుగా మారింది. నిమ్స్ (NIMS) గణాంకాల ప్రకారం నగరంలో నమోదవుతున్న పురుషుల క్యాన్సర్ కేసుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వాటా ఇప్పటికే 6.9 శాతానికి చేరుకుం

  • Hotels Supplying Food Eaten

    Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

  • Commercial Shops

    తెలంగాణ‌లో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?

  • Dating Apps Hyderabad

    Dating Apps: హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌లో అమ్మాయిలే టాప్

  • Software employee Ishika Yadav

    ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

  • Lockdown : పాకిస్థాన్లో లాక్డౌన్..!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd