HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hotels Supplying Food Eaten By Rats And Mice

Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

హైదరాబాద్‌ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' హోటల్ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వినియోగదారుడు ఆదివారం జొమాటో ద్వారా

  • Author : Sudheer Date : 07-04-2026 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hotels Supplying Food Eaten
Hotels Supplying Food Eaten

హైదరాబాద్‌లోని హోటళ్లలో ఆహార నాణ్యత ఏ స్థాయిలో ఉందో మరోసారి బయటపడింది. బంజారాహిల్స్‌లోని ‘లక్కీ బిర్యానీ షవర్మ’ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న ‘లక్కీ బిర్యానీ షవర్మ’ హోటల్ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వినియోగదారుడు ఆదివారం జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా, అది తీవ్రమైన దుర్వాసనతో కూడి ఉంది. ఆహారం పాడైపోయిందని గ్రహించిన ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్‌పై ఆకస్మిక దాడి చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ యజమాని ఇర్ఫాన్ కేవలం లాభాపేక్షతో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

మూడు రోజుల నిల్వ.. ఎలుకల సంచారం!

పోలీసుల తనిఖీల్లో వెల్లడైన విషయాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జీడిమెట్లలో మూడు రోజుల క్రితమే తయారు చేసిన సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లను తీసుకువచ్చి ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ రాగానే వాటిని ఓవెన్‌లో వేడి చేసి, తాజాగా ఉన్నట్లు నమ్మించి కస్టమర్లకు పంపిస్తున్నారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, ఆ బిర్యానీ ప్యాకెట్లు ఉంచిన ఫ్రిడ్జ్‌లో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. హోటల్ కిచెన్ అంతా బొద్దింకలు, చెత్తాచెదారం మరియు దుర్వాసనతో అపరిశుభ్రంగా ఉంది. ఎలుకలు, బొద్దింకలు తిన్న ఆహారాన్నే ప్రజలకు వడ్డిస్తూ హోటల్ యాజమాన్యం బరితెగించింది.

హోటల్ సీజ్.. క్రిమినల్ కేసులు నమోదు

ఈ భయంకరమైన పరిస్థితులను చూసిన పోలీసులు వెంటనే హోటల్‌ను సీజ్ చేశారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆహార నమూనాలను సేకరించారు. ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగిస్తున్న యజమాని ఇర్ఫాన్‌పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే వారు, కేవలం రేటింగ్స్ చూసి మోసపోకుండా హోటళ్ల నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banjara Hills Police Raid
  • Food Poisoning Alert
  • hyderabad
  • Hyderabad Food Safety
  • Lucky Biryani Shawarma Banjara Hills
  • Stale Biryani packets
  • Unhygienic Hotels in Hyderabad

Related News

Good news for burger lovers: Burger Singh restaurant opens in Hyderabad.

Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం

Burger Singh : భారతదేశపు అతిపెద్ద స్వదేశీ బర్గర్ బ్రాండ్ ‘బర్గర్ సింగ్’ (Burger Singh) మళ్లీ హైదరాబాద్ మార్కెట్లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెట్టింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు నగరంలో విజయవంతంగా నడిచిన ఈ బ్రాండ్.. తాత్కాలిక విరామం తర్వాత ఇప్పుడు మరింత పటిష్టమైన విస్తరణ ప్రణాళికలతో రీ-ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత రెస్టారెంట్ వృద్ధి వేదికను నిర్మించ

  • Drug scare in Hyderabad: MLC's son arrested while attempting to purchase drugs.

    Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్‌

  • Controversy over 'Kalma' homework at a private school in Hyderabad; teacher wrote in the diary instructing students to read the Quran.

    హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో కల్మా’ హోంవర్క్ వివాదం.. ఖురాన్ చదవాలంటూ డైరీలో రాసిన టీచర్

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd