TRS Alliance: టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని ఎవరు అడిగారు?అదో ఔట్ డేటెడ్ పార్టీ-కేటీఆర్.!!
శుక్రవారం వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
- By Hashtag U Published Date - 11:26 PM, Sat - 7 May 22

శుక్రవారం వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోమని కాంగ్రెస్ ను ఎవరు అడిగారు..?అంటూ ప్రశ్నించారు. అమేథీలో ఒడిపోతాననే భయంతోనే కేరళ వెళ్లి అక్కడ గెలిచారని ఎద్దేవా చేశారు. గాంధీభవన్ను గాడ్సేకు అప్పజెప్పిన రాహుల్ లోకం తెల్వని అజ్ఞానిఅని అభివర్ణించారు. తెలంగాణలో చాలా తక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు జరిగాయన్నారు.
వరంగల్లో జరిగింది రైతు సంఘర్షణ కాదని…కాంగ్రెస్ సంఘర్షణ సభ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇక ఏఐసీసీ అంటే ఆలిండియా క్రైసిస్ కమిటీగా పేర్కొన్నారు. 1953 నుంచి 2013 వరకు తెలంగాణ ప్రజలది పోరాటమేనన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో రైతుబంధు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవడం కాదు…పరిస్థితులను అర్థం చేసుకుని…తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పాలనా అంతా కూడా స్కాములేనని…కాంగ్రెస్ ఒక ఔట్ డేటెడ్ పార్టీ అంటూ కేటీఆర్ తనదైన శైలిలో విమర్శించారు.
Related News

Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు..!
ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈడీ , సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ కుటుంబం బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు.