Hyderabad : అర్ధరాత్రి నడి రోడ్డుపై ఇలాంటి పనులేంటి..? సజ్జనార్ ఫైర్ !
Hyderabad : ప్రత్యేకించి అర్ధరాత్రి సమయంలో రోడ్లపై గుమికూడి, మద్యం సేవిస్తూ, హంగామా చేస్తూ స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు
- By Sudheer Published Date - 12:05 PM, Tue - 3 June 25

ఇటీవల హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో యువత రాత్రిపూట రోడ్లపై జన్మదిన వేడుకలు (Birthday Celebrations ) నిర్వహిస్తూ హల్చల్ చేస్తున్నారు. ప్రత్యేకించి అర్ధరాత్రి సమయంలో రోడ్లపై గుమికూడి, మద్యం సేవిస్తూ, హంగామా చేస్తూ స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. ఇటువంటి వ్యవహారంతో శాంతిభద్రతలకు భంగం ఏర్పడుతుందని పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా ఉప్పల్‌లోని భగాయత్ రోడ్డుపై అర్ధరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న యువతను పోలీసులు పట్టుకుని గట్టిగా మందలించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Brahmaputra River : బ్రహ్మపుత్ర నీటిపై పాక్ ప్రచారం.. అస్సాం సీఎం కౌంటర్!
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) కూడా దీనిపై స్పందించారు. ఎక్స్ ఖాతాలో వీడియోను షేర్ చేసి.. “నడిరోడ్ల మీద ఇదేం అతి!” అంటూ యువత తీరును తీవ్రంగా విమర్శించారు. రోడ్లపై జరిగే ఈ హంగామా ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోందని, సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన వల్ల యువత సామాజిక బాధ్యతను మరిచిపోతున్నారని అన్నారు. బర్త్‌డే వేడుకలను ఇంట్లో కుటుంబ సభ్యులతో కలసి జరుపుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై పర్యవేక్షణ పెంచాలని కోరారు. పోలీసులు కూడా రోడ్లపై హంగామా చేస్తూ వేడుకలు చేసుకునే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నెటిజన్లు కూడా ఈ విషయంలో పోలీసులకు మద్దతు ఇస్తూ “ఇంట్లోనే సెలబ్రేట్ చేయండి – రోడ్లపై రచ్చ వద్దు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
నడిరోడ్ల మీద ఇదేం అతి!!
దోస్తులను పిలవాలి.. నడిరోడ్డు మీదకు రావాలి. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో నానా హంగామా చెయ్యాలి. రోడ్ల మీద వెళ్లే వారికి ఇబ్బందులు కలిగిన, అసౌకర్యానికి గురైన వారికేం పట్టదు.
నది రోడ్లపై ఇలా బర్త్ డే వేడుకలు యువతకు ఫ్యాషన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫేమస్… pic.twitter.com/Wu0hd0EgJj
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 2, 2025