Weather Update : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు..
నైరుతి రుతుపవనాలు నేడు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.
- Author : News Desk
Date : 08-06-2023 - 7:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఎండాకాలం(Summer( అయిపోవచ్చింది. సమ్మర్ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సంవత్సరం ఎండలు మరింత ఎక్కువ ఉండటంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం, తొలకరి చినుకుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) మరి కొన్ని రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోకి రానున్నాయి.
నైరుతి రుతుపవనాలు నేడు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల గాలులు కూడా వీస్తున్నాయి. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య మరియు పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే తెలంగాణ, ఏపీలోకి కొన్ని ప్రదేశాల్లో రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులుతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వడగాల్పులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
Weather: రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక..!