Kaleshwaram Commission Notices : నోటీసులను ధైర్యంగా ఎదుర్కొంటాం – KTR
Kaleshwaram Commission Notices : “ఇది కాంగ్రెస్ మరియు బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. ఈ నోటీసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
- Author : Sudheer
Date : 21-05-2025 - 4:25 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం (Kaleshwaram project controversy) మళ్లీ వార్తల్లో నిలిచింది. మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Kaleshwaram Lift Irrigation Project) సంబంధిత కమిషన్ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) స్పందిస్తూ.. “ఇది కాంగ్రెస్ మరియు బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. ఈ నోటీసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Drones : కోల్‌కతా గగనతలంలో డ్రోన్ల కలకలం.. రంగంలోకి రక్షణశాఖ
“17 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజల కోసం చేసింది ఏముంది? కమీషన్లు, విచారణలు తప్ప మరో పని లేదు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇప్పుడు కేసీఆర్‌పై నోటీసులు ఇస్తున్నారు” అని ఆయన ఆరోపించారు. ప్రజల శ్రేయస్సు కోసం చేపట్టిన ప్రాజెక్టులను రాజకీయ కక్షతో విచారణల కోణంలో చూస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హామీలపై కూడా KTR విమర్శలు గుప్పించారు. “ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? తులం బంగారం ఎక్కడ? రూ.4వేల పెన్షన్ మాటలకే పరిమితమైపోయింది” అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో జరిగాయని చెప్పిన KTR, రాజకీయ కుట్రల ద్వారా బీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలని చూస్తే ప్రజలే బదులు చెబుతారని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.