HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >We Are Fight For Nationwide Bc Movement R Krishnaiah

R.Krishnaiah: దేశవ్యాప్త బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తున్నాం: ఆర్. కృష్ణయ్య

బీసీ  ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.

  • Author : Balu J Date : 23-09-2023 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
R Krishnaiah
R Krishnaiah

R.Krishnaiah: బీసీ  ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తామని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. తాము చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సంపూర్ణ సహకారం, మద్దతును  ప్రకటించారన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన మహిళా బిల్లు కోసం కవిత చేసిన పోరాటం ఫలించిందని అందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఎమ్మెల్సీ కవితపై కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లతో ఆమెను కలిశారు. తాము చేపట్టే బీసీ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. ఈ విషయంలో ఆర్. కృష్ణయ్య సహా పలు బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల ప్రతినిధులు దేశంలో నెలకొన్న రాజకీయాలు, ప్రత్యేకించి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వెనుక జరిగిన పరిణామాలు, అనంతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి జాగృతి సంస్థ ద్వారా ఎమ్మెల్సీ కవిత  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, విస్తరణ కోసం పనిచేశారని, బతుకమ్మ ఖ్యాతిని పెంచటంలో క్రియాశీల పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో మహిళా బిల్లు కోసం అనేక ప్రయత్నాలు చేశారని ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య  వివరించారు. పార్లమెంట్ ఆమోదించిన మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పూర్తి సంతృప్తిగా లేరన్నారు. ఆమోదించిన మహిళా బిల్లును ఆత్మలేని శరీరం వంటిదని కవిత వాపోవటమే అందుకు నిదర్శనం అన్నారు. మహిళా బిల్లులో బీసీలకు అన్యాయం జరిగిందనే కచ్చితమైన అభిప్రాయంతో ఎమ్మెల్సీ కవిత ఉన్నందుకు తమకు గర్వంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ నుంచే బలమైన బీసీ ఉద్యమ నిర్మాణం చేపట్టి కేంద్రం మెడలు వంచి తీరుతామని కృష్ణయ్య స్పష్టం చేశారు. తాము చేపట్టే బీసీ ఉద్యమానికి తన జాగృతి సంస్థ ద్వారా, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా కవిత తమకు సంపూర్ణ మద్దతను ఇస్తామని ప్రకటించాలని కోరేందుకు వస్తే తమకు అభిమతాన్ని స్వీకరించి సంపూర్ణ మద్దతును ఇచ్చినందుకు ఆయన ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కులగణన అనే ఈ మూడు డిమాండ్లతో మరో జాతీయ బీసీ ఉద్యమానికి ఉద్యమాల తెలంగాణ గడ్డ నుంచే శంఖారావం పూరిస్తామని చెప్పారు.

అందులో భాగంగా ఈనెల 26న జలవిహార్లో రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులతో సదస్సు నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు.  దశాబ్దాల కాలంగా బీసీ రిజర్వేషన్ల కోసం తాము ఉద్యమిస్తున్నామని, ఇప్పటికే 85 సార్లు ఢిల్లీలో ధర్నా నిర్వహించామని, దేశాన్ని ఏలిన ప్రధానమంత్రులను 65సార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపటాన్ని తాము స్వాగతిస్తూనే అందులో బీసీలకు చోటులేకపోవడంపైనా తాము ఉద్యమిస్తామన్నారు. కేంద్రం బీసీ బిల్లు పెట్టి ఆమోదించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 26న జలవిహార్లో సదస్సు నిర్వహించిన తరువాత బీసీ బిల్లు కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని, బీసీ బిల్లును పార్లమెంట్ ఆమోదించేదాకా  దశలవారీగా దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉద్యమాన్ని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC
  • hyderabad
  • Movement
  • r krishnaiah

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd