HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Water Woes In Hyderabad Demand For Water Tankers Rises

హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Water Woes in Hyderabad Demand for Water Tankers Rises
Water Woes in Hyderabad Demand for Water Tankers Rises

హైదరాబాద్‌లో సమ్మర్ ప్రభావంతో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. కొద్ది రోజులుగా నీళ్ల ట్యాంకర్ల కోసం బుకింగ్‌లు పెరిగాయి. నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటి వేళల్లో గృహ అవసరాల కోసం ట్యాంకర్లు పంపిస్తున్నారు. రాత్రి వేళల్లో కమర్షియల్ అవసరాల కోసం ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ట్యాంకర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయని చెబుతున్నారు.

హైదరాబాద్‌పై వేసవికాలం ప్రభావం కనిపిస్తోంది.. బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నీళ్లకు డిమాండ్ పెరిగింది. నగరంలో ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది.. కొద్దిరోజులుగా బుకింగ్‌లు బాగా పెరిగాయి. ఈ క్రమంలో వాటర్ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట గృహ అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. రాత్రి వేళల్లో వాణిజ్య అవసరాల కోసం నీళ్లను సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నీళ్ల ట్యాంకర్లను పర్యవేక్షిస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో రోజుకు ఏకంగా 11వేలకు పైగా ట్రిప్పుల నీళ్లు డెలివరీ చేస్తున్నారు. ట్యాంకర్ బుక్ చేసుకున్న 24 గంటల్లోనే ట్యాంకర్ అందిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు.

గ్రేటర్‌ నగర పరిధిలో 30 ప్రాంతాల్లో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. నిజాంపేట, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, వెంకటగిరి, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, హఫీజ్‌పేట, మణికొండ, గచ్చిబౌలి, టీఎన్‌జీఓస్ కాలనీ, షేక్‌పేట వంటి ప్రాంతాలు ఉన్నాయి. నగరంలోని వాటర్ బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 11,233 ట్యాంకర్ల ద్వారా 11 వేల ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా మొత్తం 84 ఫిల్లింగ్‌ స్టేషన్ల వారీగా సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఐటీ విభాగం ద్వారా డాష్‌ బోర్డును సిద్ధం చేయించారు. ఒకవేళ బుకింగ్‌లు ఏవైనా పెండింగ్‌లో ఉంటే తెలిసేలా ప్రణాళిక చేశారు.

వంద లోపు బుకింగ్స్ పెండింగ్‌ ఉంటే ఒక రంగు, అదే 200 వరకు పెండింగ్ ఉంటే మరో రంగు, 200లకు పైగా ట్యాంకర్లు పెండింగ్‌లో ఉంటే మరో రంగు ఉండేలా రూపొందించారు. ఇలా ట్యాంకర్లకు సంబంధించిన వివరాలు డిస్‌ప్లే అవుతున్నాయి. ఒకవేళ పెండింగ్ ఉంటే.. ఆయా వాటర్ ఫిల్లింగ్‌ స్టేషన్ల వారీగా అధికారులను అలర్ట్‌ చేస్తారు. రోజువారీ బుకింగ్‌లతో పాటు డెలివరీ, పెండింగ్ ఉన్నవి సులువుగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా బుకింగ్స్ పెండింగ్ ఉంటే కారణాలు తెలుసుకుని వారికి 24 గంటల్లోగా ట్యాంకర్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. డిమాండ్‌కు సరిపడా ట్యాంకర్లు పంపేందుకు అర్ధరాత్రి వరకు ఫిల్లింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. అవసరమైన చోట్ల ఫిల్లింగ్ స్టేషన్లను పెంచారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Huge Demand
  • hyderabad
  • Water problem areas
  • water problem in hyderabad
  • Water Problems
  • water tankers

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd