BRS: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్
- Author : Latha Suma
Date : 16-03-2024 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
MP Pasunuri Dayakar : లోక్‌సభ ఎన్నికలకు ముందు వరంగల్(Warangal)లో బీఆర్‌ఎస్(BRS)కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్(Sitting MP Pasunuri Dayakar) కాంగ్రెస్(Congress)లో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. https://t.co/txcLLnAXJF pic.twitter.com/T2Ax4QVf6O
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2024
మంత్రి కొండా సురేఖ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో అసంతృప్తితో ఉన్న పసునూరి తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దాంతో కాంగ్రెస్‌లో ఆయన చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
మరోసారి వరంగల్ ఎంపీ సీటును ఆశించి దయాకర్ భంగపడ్డారు. ఇటీవల వరంగల్ నేతలతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఎంపీ సీటును కేటాయించారు. వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని తాను కోరినప్పటికీ అధిష్టానం పట్టించుకోకపోలేదు. దాంతో పసునూరి దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ పసునూరి హస్తం గూటికి చేరారు.
read also:Gang of Godavari: విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్
మరోవైపు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి శుక్రవారమే సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు (క్రీడా వ్యవహారాలు)గా జితేందర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.